Wednesday, 25 March 2026
  • Home  
  • రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి!
- ఖమ్మం

రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి!

రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి! అన్నారుగూడెం గ్రామంలో ఈరోజు రైతు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో రైతాంగం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పొలాలలో పెరిగిపోయిన దొంగ వరి (నకిలీ గడ్డి)ని ప్రదర్శిస్తూ రైతులు గట్టిగా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన సమస్యలు: • ఈ ఖరీఫ్ సీజన్లో అన్నారుగూడెం, గోపాలపేట, బాలంపేట, మల్లారం, తల్లాడ, బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, వెంగన్నపేట, నూతనకల్ తదితర గ్రామాల్లో రైతులు వరి పొలాలలో వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. • కలుపు నివారణ కోసం పి ఐ కంపెనీ లగాసీ, బిఏఎస్‌ఎఫ్ కంపెనీ పాసెట్, బాసాగ్రామ్, బేయర్ కంపెనీ రైస్ బ్రాన్, కొట్టివా కంపెనీ నో వ్యాక్సిడ్ వంటి పలు మందులను 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసి స్ప్రే చేసినప్పటికీ ఫలితం రాలేదు. • వరిని పోలిన దొంగ వరి చావకుండా మరింత విస్తరించి, పొలాలను గడ్డి మయం చేసి, పంట దిగుబడి సగానికి తగ్గించే పరిస్థితి నెలకొంది. రైతుల ఆవేదన: “మేము రాత్రింబగళ్లు కష్టపడి పండించే పంటలను నకిలీ మందులు నాశనం చేస్తున్నాయి. కంపెనీలు లాభం కోసం నాసిరకం మందులు సరఫరా చేస్తూ రైతును అప్పుల బారిన పడేస్తున్నాయి. ఇలా సాగితే రైతు బతకలేడు, వ్యవసాయం కూడా బందు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కిసాన్ మోర్చా నాయకులు ఆపతి వెంకట రామారావు గా తెలియజేశారు

రైతు సోదరుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులను అరికట్టాలి – రైతాంగాన్ని కాపాడాలి!

అన్నారుగూడెం గ్రామంలో ఈరోజు రైతు ఆపతి వెంకట రామారావు ఆధ్వర్యంలో రైతాంగం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పొలాలలో పెరిగిపోయిన దొంగ వరి (నకిలీ గడ్డి)ని ప్రదర్శిస్తూ రైతులు గట్టిగా ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు తెలిపిన సమస్యలు:
• ఈ ఖరీఫ్ సీజన్లో అన్నారుగూడెం, గోపాలపేట, బాలంపేట, మల్లారం, తల్లాడ, బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, వెంగన్నపేట, నూతనకల్ తదితర గ్రామాల్లో రైతులు వరి పొలాలలో వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు.
• కలుపు నివారణ కోసం పి ఐ కంపెనీ లగాసీ, బిఏఎస్‌ఎఫ్ కంపెనీ పాసెట్, బాసాగ్రామ్, బేయర్ కంపెనీ రైస్ బ్రాన్, కొట్టివా కంపెనీ నో వ్యాక్సిడ్ వంటి పలు మందులను 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసి స్ప్రే చేసినప్పటికీ ఫలితం రాలేదు.
• వరిని పోలిన దొంగ వరి చావకుండా మరింత విస్తరించి, పొలాలను గడ్డి మయం చేసి, పంట దిగుబడి సగానికి తగ్గించే పరిస్థితి నెలకొంది.

రైతుల ఆవేదన:

“మేము రాత్రింబగళ్లు కష్టపడి పండించే పంటలను నకిలీ మందులు నాశనం చేస్తున్నాయి. కంపెనీలు లాభం కోసం నాసిరకం మందులు సరఫరా చేస్తూ రైతును అప్పుల బారిన పడేస్తున్నాయి. ఇలా సాగితే రైతు బతకలేడు, వ్యవసాయం కూడా బందు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కిసాన్ మోర్చా నాయకులు ఆపతి వెంకట రామారావు గా తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.