రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*

0
262
రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా*

*నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం*

*దేశానికి వెన్నెముక రైతన్న*

*రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం..

— *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*

“ఎన్నికలకు మునుపు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని కృష్ణా జలాలతో నింపుతామని అప్పుట్లో హామీ ఇచ్చాను. కచ్చితంగా ఈ రెండేళ్లలో అన్ని చెరువులను నింపి తీరుతాను..” అని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి పేర్కొన్నారు.
కదిరి మండల పరిధిలోని పట్నం రంగనాయకుని చెరువును ఎమ్మెల్యే చొరవతో హంద్రీనీవా జలాలతో నింపారు.  ఆదివారం ఎమ్మెల్యే ఆ చెరువులోకి దిగి జల హారతి ఇచ్చారు. అనంతరం మహానేత వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడే మీడియాతో మాట్లాడారు.
*అందులోని ముఖ్యాంశాలు:*

®  మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో హంద్రీనీవా ప్రాజెక్టు ను ప్రారంభించారు.

© వైయస్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.

©వైఎస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వెంటనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి.

© హంద్రీనీవా కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే. ఈ కాలువ గుండా ఎక్కువ నీటిని తీసుకురావడం సాధ్యపడదు . అందుకే దీన్ని ఈ రెండేళ్లలో 6 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు.

© కదిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 380 చెరువులు ఉండగా ఈ రెండేళ్లలో 366 చెరువులు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉండవు.

© తలుపుల, ఎన్ పి కుంట మీదుగా వెళ్తున్న హంద్రీనీవా మెయిన్ కెనాల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.

©దేవుడి కృప, ప్రజలందరి ఆశీర్వాదాలతో నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాను.
,* రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేశానికి వెన్నెముక రైతన్న. మాది రైతు ప్రభుత్వమని నిరూపించు కుంటాము.

0
0