Tuesday, 24 March 2026
  • Home  
  • రైతులు వద్దకే యూరియా దుక్కిపిండి .
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులు వద్దకే యూరియా దుక్కిపిండి .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి)

మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.