భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పగడవరపు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
ఈనెల 15వ తారీకు నేలకొండపల్లిలో జరిగిన ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ విస్తృత కార్యకర్తల సమావేశంలో చేసిన రెండు తీర్మానాల కాపీలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్అ సంఘ్ధ్య క్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు గ మాట్లాడుతూ…
* సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి కామేపల్లి ఏన్కూరు మండలాలకు నీళ్లు ఇవ్వాలని ఆ మండలాలు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.. పాత ప్లాన్ ప్రకారం కాలువలు తొవ్వి అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీని అటువైపు నీరు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఏజెన్సీ రైతులపై ప్రబుత్వం వివక్షను చూపడం దురదృష్టకరం అని ఈ మేరకు జిల్లా సమావేశం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందించాలని కోరారు
* అదే విధంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న సీడ్ మొక్కజొన్న రైతులకు కంపెనీలకు మధ్య దళారీలు తీవ్రంగా మోసం చేస్తున్నారని కాబట్టి నేరుగా కంపెనీలే సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు విత్తనాల నుంచి నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని భారతీయ కిసాన్ సంఘ్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి గౌరవ జాయింట్ కలెక్టర్ ద్వారా అందించడం జరిగింది.
దానితోపాటు కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామంలో భక్త రామదాసు కాలువ నష్టపరిహారం ఇవ్వని కారణంగా రైతు కాలువ పూడ్చడం తొ కాలువ నీళ్లు రైతుల పొలాల నుండి పోతూ నష్టం జరుగుతుందని ఈ సమస్యపై వెంటనే దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరడం జరిగింది
* అదేవిధంగా తనికెళ్లలో చేలకు వెళ్లే డొంకా పూర్తిగా బురదమయమై నీళ్లు నిలబడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్య రోడ్డు వేయాలని కోరడం జరిగింది..
* చింతకాని మండలం తిమ్మినేనిపాలెం లో గతంలో ఉన్న డొంకను కొంతమంది ఆక్రమించి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.
* అదేవిధంగా కొనిజర్ల మండలం రామనర్సయ్య నగర్ సంబంధించి సీడ్ విత్తనాలు పండించిన రైతులను ఆరు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మధ్యవర్తి సైదాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదురు రైతులకు నగదు ఇప్పించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జోన్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి తూము అప్పారావు కొనిజర్ల మండల అధ్యక్షుడు సత్యనారాయణ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

రైతన్న ల సమస్య లను వెంటనే పరిష్కరించాలి. BKS డిమాండ్
భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పగడవరపు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈనెల 15వ తారీకు నేలకొండపల్లిలో జరిగిన ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ విస్తృత కార్యకర్తల సమావేశంలో చేసిన రెండు తీర్మానాల కాపీలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్అ సంఘ్ధ్య క్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు గ మాట్లాడుతూ… * సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి కామేపల్లి ఏన్కూరు మండలాలకు నీళ్లు ఇవ్వాలని ఆ మండలాలు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.. పాత ప్లాన్ ప్రకారం కాలువలు తొవ్వి అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీని అటువైపు నీరు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఏజెన్సీ రైతులపై ప్రబుత్వం వివక్షను చూపడం దురదృష్టకరం అని ఈ మేరకు జిల్లా సమావేశం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందించాలని కోరారు * అదే విధంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న సీడ్ మొక్కజొన్న రైతులకు కంపెనీలకు మధ్య దళారీలు తీవ్రంగా మోసం చేస్తున్నారని కాబట్టి నేరుగా కంపెనీలే సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు విత్తనాల నుంచి నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని భారతీయ కిసాన్ సంఘ్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి గౌరవ జాయింట్ కలెక్టర్ ద్వారా అందించడం జరిగింది. దానితోపాటు కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామంలో భక్త రామదాసు కాలువ నష్టపరిహారం ఇవ్వని కారణంగా రైతు కాలువ పూడ్చడం తొ కాలువ నీళ్లు రైతుల పొలాల నుండి పోతూ నష్టం జరుగుతుందని ఈ సమస్యపై వెంటనే దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరడం జరిగింది * అదేవిధంగా తనికెళ్లలో చేలకు వెళ్లే డొంకా పూర్తిగా బురదమయమై నీళ్లు నిలబడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్య రోడ్డు వేయాలని కోరడం జరిగింది.. * చింతకాని మండలం తిమ్మినేనిపాలెం లో గతంలో ఉన్న డొంకను కొంతమంది ఆక్రమించి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. * అదేవిధంగా కొనిజర్ల మండలం రామనర్సయ్య నగర్ సంబంధించి సీడ్ విత్తనాలు పండించిన రైతులను ఆరు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మధ్యవర్తి సైదాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదురు రైతులకు నగదు ఇప్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జోన్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి తూము అప్పారావు కొనిజర్ల మండల అధ్యక్షుడు సత్యనారాయణ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

