సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
రేబీస్ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తుండగా, వీరిలో చాలా మంది 15 ఏళ్ల లోపు పిల్లలే. రేబీస్ లక్షణాలు ఒకసారి కనిపిస్తే అది 100% ప్రాణాంతకం. 99% కేసులు కుక్కల కాటు లేదా గీతల వల్ల వస్తాయి. అయితే, ఇది నివారించదగిన వ్యాధి. కరిచిన/g గీతేసిన వెంటనే గాయం అయిన ప్రదేశాన్ని కనీసం 15 నిమిషాలు సబ్బుతో కడగాలి. వెంటనే వ్యాక్సిన్ కోర్స్ తీసుకోవాలి. అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ (RIG) తీసుకోవాలి. కుక్కలకు టీకాలు వేయడం, అవగాహన పెంపొందించడం, సమయానికి చికిత్సతో రేబీస్‌ను పూర్తిగా నివారించవచ్చు.


