Wednesday, 18 February 2026
  • Home  
  • రెవెన్యూ సమరం-తొట్టంబేడులో నిరసన గళం
- తిరుపతి

రెవెన్యూ సమరం-తొట్టంబేడులో నిరసన గళం

తొట్టంబేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: తొట్టంబేడు మండల రెవెన్యూ యంత్రాంగం నిరసన బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ (Revenue JAC) రాష్ట్రవ్యాప్త పిలుపుతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల ఉప తహసీల్దారు, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సాహంగా సాగింది. మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. వారి ప్రధాన డిమాండ్లు: పనిభారం తగ్గించాలి: రెవెన్యూ శాఖపై ఉన్న విపరీతమైన పని ఒత్తిడిని తగ్గించి, సిబ్బంది కొరతను తీర్చాలి. ఆర్థిక బకాయిల విడుదల- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ లు, జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత- క్షేత్రస్థాయి ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు, అర్హులైన వారికి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ సందర్భంగా కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ…. రాత్రింబవళ్లు ప్రజల సేవలో తరిస్తున్న రెవెన్యూ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం విస్మరించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. జె.ఎ.సి (JAC) పిలుపు మేరకు తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొని సంఘీభావం తెలిపారు.

తొట్టంబేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: తొట్టంబేడు మండల రెవెన్యూ యంత్రాంగం నిరసన బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ (Revenue JAC) రాష్ట్రవ్యాప్త పిలుపుతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల ఉప తహసీల్దారు, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సాహంగా సాగింది. మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
వారి ప్రధాన డిమాండ్లు: పనిభారం తగ్గించాలి: రెవెన్యూ శాఖపై ఉన్న విపరీతమైన పని ఒత్తిడిని తగ్గించి, సిబ్బంది కొరతను తీర్చాలి. ఆర్థిక బకాయిల విడుదల- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ లు, జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత- క్షేత్రస్థాయి ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు, అర్హులైన వారికి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ సందర్భంగా కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ…. రాత్రింబవళ్లు ప్రజల సేవలో తరిస్తున్న రెవెన్యూ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం విస్మరించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. జె.ఎ.సి (JAC) పిలుపు మేరకు తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొని సంఘీభావం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.