‘చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావుగా… ఎందుకు సిగ్గు పడుతూ.. ఓరకంటిలో చూస్తున్నావ్!..’ పెళ్ళి పీటల మీద వరుడుగ వధువు రూపతో అన్నాడు విజయ్ సిగ్గుపడుతూనే.. ‘ఆ.. అవును నీ ముఖం చూస్తేనే సిగ్గేస్తుంది. సరెసరే… ముందు పంతులు చెప్పే మంత్రాలు పలుకుదాం… మిస్ చేసామంటే… మంత్రాల పవర్ తగ్గి లైఫ్లాంగ్ ఫైటింగ్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది’ అందిరూప.
‘అవునవును’ అంటూ విజయ్ కళ్ళు తెరచి చూడగానే ఎదురుగా ఉన్న బెడ్ పై బెడ్షీట్ మడతేస్తున్న అమ్మ రుక్మిణిని చూసి ‘అమ్మా… అప్పుడే తెల్లారిందా!… ‘ఆc.. తెల్లారక నీవు కలలు కంటూ ఉండమని పొద్దు ఆగుతుంది మరీ!.. అయినా ఆ రూప నీకు ఎంత అపురూపమైతే మాత్రం మరీ.. ఆ కలవరింపులు ఏంట్రా… ఇదో.. నీ ఆరాటం చూడలేక నీ కోరిక మేరకు నేను మీనాన్న ఆ రూప ఇంటికెళ్లి… మా అబ్బాయి.. మీ అమ్మాయి.. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్ట పడుతున్నాడు.. ఆస్థి అంతస్తుల్లో మీకన్నా ఏమాత్రం తీసిపోము.. అని బ్రతిమాలుకొని మొన్ననే నీపెళ్ళి ఆ రూపతో ఫిక్స్ చేసకున్నాంకదా.. నిజం చెప్పాలంటే ఈ సంబంధం మాకిష్టం లేదు.. ఆ రఘరాం ఉన్నాడే.. అదే నీకు కాబొయె మామగారు.. మహాగర్విష్టి.. ఎదుటివారిని గౌరవించటం తెలియదా!… కనీసం కూర్చొమనికూడా చెప్పడు…
మేమేం తుక్కువా?.. ఆయనగారు చెప్పేదేముందని మేమే దర్జాగా కూర్చొని మాట్లాడాం.. అంది రుక్మిణి కాస్త అసహనంగా. ‘అమ్మా… నా కోసం నా ఆనందం కోసమేకదా.. మీ శ్రమంతా.. అయితే ఇప్పుడేమైంది అన్నాడు విజయ్.
‘అసలు విషయం నీకు తెలియదురా.. ఆ రూపావాళ్ల అమ్మా నాన్న ఒక కండీషన్ పెట్టారు’ అంది రుక్మిణి. ‘పెళ్లికి ఓకే అన్నాక కండీషన్ ఏంటి?… ఇంతకు ఎంటంట… అయినా అవన్ని మీరు చూసుకోండి.. రూపతో నాకు పెళ్లి అయితే చాలు… రూప ఒప్పుకుందిగా అదే నాకు భాగ్యం. అన్నాడు విజయ్. ‘ఆc.. భాగ్యమే.. పెళ్ళికి ముందు నీవు ఏ-టు-జెడ్ ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలట… మనది రెస్టారెంట్ మరియు బార్ నడిపే ఫ్యామిలీఅట.. నికార్స్ గా ఉండడానికి అవకాశాలు తక్కువట.. అన్నిటెస్ట్లు నెగెటివ్ వస్తేనే నీపెళ్ళి జరుగుతుందట. ఆ.. అన్నట్లు చెప్పటం మరచిపోయా.. ఈరోజే చేయించుకోవాలట.. వాళ్ళఫ్యామిలీ డాక్టర్ని 11గంటలకు నిన్ను కలవమన్నారు… ఇదెక్కడ విడ్డూరం.. ఇటువంటివి మన వంశం లోనే ఎప్పుడయినా జరిగాయా..?’ అంది రుక్మిణి విచారంగా.
‘అమ్మా దీనికే ఇంతలా డీలా పడిపోతే ఎలా.. అయినా నాకేంటీ.. ఆరోగ్యంగానే ఉన్నా కదా.. అన్ని టెస్టుల్లో నెగటివే వస్తుంది… నీవేం కంగారు పడకు … రాబోయే అందమైన కోడలికి హ్యాపీగా వెల్కమ్ చెప్తువుగాని..’ అంటూ చకచక రెడీ అయ్యి రూప వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్.
రూప దగ్గరుండి అన్ని టెస్టులు చేయించింది. ‘రిపోర్ట్స్ రావడానికి మరో రెండు గంటలు పడుతుంది’ అన్నాడు డాక్టర్. ‘ఓకే డాక్టర్’ అని చెప్పి రూపతో అలా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి ఫుడ్కోర్ట్ లో కూర్చొని కాఫీ ఆర్డర్ చెప్పి ‘నీవు చెప్పినట్లుగానే అన్ని టెస్ట్లు చేయించుకున్నాను… మరినీవు చేయించుకోవా’ అన్నాడు విజయ్ వినయంగా రూపతో. వెంటనే తను చేయించుకున్న వివిధ రకాల టెస్టులు మరియు రిపోర్ట్లు చుపించింది రూప.
అందులో అన్నీ నెగిటివ్ గానే ఉన్నాయి. ‘హెల్త్ టెస్ట్ చేయించుకోవటం మనిషిని అనుమానించటానికో.. అవమానించటానికో కాదు. ఆరోగ్యకరమైన సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నిబంధన మరియు మన సామాజిక బాధ్యత’ అంది రూప. ‘యస్ వందశాతం నీవు చెప్పింది కరెక్ట్ రూప… ఆరోగ్యంగా లేని వారికి మరొకరికి జన్మనిచ్చే అర్హత లేదు. మన గవర్నమెంట్ దీన్ని చట్టం చేస్తే చాలా బాగుంటుంది.
సరేసరే… మాటల్లో పడి రెండుగంటలు దాటిపోయింది. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి వెళ్దాంపదా..’ అంటూ విజయ్ ఉత్సాహంగా రూప చేయి పట్టుకొని నడుచుకుంటూ రిపోర్ట్ డిస్పాచ్ సెంటర్ సమీపానికి వచ్చేలోపల రఘరామ్ కారు సర్రునవచ్చి వీరికి ఎదురుగా ఆగింది. ‘నాన్నా… విజయ్ కి అన్ని టెస్టులు చేయించాను. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి తీసుకుని వచ్చేస్తాను.’ విజయ్ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు అనే నమ్మకంతో ఆనందంగా చెప్పింది రూప. ‘అక్కర్లేదు… ఇప్పుడే మన డాక్టర్ సుకుమార్ ఫోన్ చేశాడు.. బార్లు, పబ్బులు.. నడిపే వారి సంబంధం… నేను ముందే వూహించా… ఆయినా మనకెందుకులే… ఇతనితో నీ పెళ్లి జరగదు. ముందు నీవు కారెక్కు.. అన్ని విషయాలు చెబుతాను’ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోర్సుగా రూప చేయి పట్టుకుని కారెక్కించి తీసుకెళ్ళాడు రఘరాం.
జరుగుతున్న ఈ హఠాత్పరిణామం చూస్తున్న విజయ్కు షాక్ తగిలినట్లు నోటి నుండి మాట రాలేదు. రెండు నిమిషాల తర్వాత తనను తాను సముదాయించుకొని, అసలు రిపోర్ట్లో విషయం ఏముందో తెలుసుకుందామని కంగారు పడుతూ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్.
‘హెచ్.ఐ.వి. పాజిటివ్ వచ్చింది.. నాకు తెలిసి ఈ సంవత్సరానికి నీది రెండవ కేసు… డోంట్ వర్రీ…. ఈ ప్రిస్కిప్సన్ ఫాలో అయితే లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు!.. జాలిగా అన్నాడు డాక్టర్ సుకుమార్. విజయ్ నిర్ఘాంత పోయాడు. ‘నన్ను ఇష్టపడ్డ సంబంధాలను అశ్రద్ధచేసి, నాకు ఇష్టమైన రూప కోసం తపించాను… నా కోసం మా అమ్మానాన్నలు వారి ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి రఘురాంను ప్రాదేయపడి ఒప్పించారు… ఇప్పుడు ఈ విషయం వారికి తెలిస్తే తట్టుకోలేరు..’ అనుకుంటూ తీవ్ర మనస్తాపంతో రోడ్డు దాటుతూ అటుగా వస్తున్న కార్ ను ఢీకొన్నాడు.
# ###
అది మహిమ కలిగిన ఆంజనేయస్వామి దేవాలయం. ఓ రోజు మంగళవారం ఉదయం ఏడు గంటలకు పూజలు చేయుస్తూ ఉంది డాక్టర్ వనజ. ‘వనజా!… నీవు పూజలు చేయించటం చూస్తుంటే!.. ఆశ్చర్యంగా ఉంది.. ఏంటీ బెంగళూరులో హాస్పిటల్ పెట్టావంటగా.. బాగా మారిపోయావు.. సారీ..వే.. నేనప్పుడు.. కొన్ని అనివార్య కారణాల వల్ల అమెరికా వెళ్లడంతో నీ పెళ్ళికి రాలేకపోయాను. ఆ గిల్టీ ఫీలింగ్తోనే.. తర్వాత.. నేను నీకు ఫోన్ కూడా చేయలేక పోయాను.. నన్ను క్షమించు..’ అంది దైవారాధనకు వచ్చిన రూప వనజతో.
‘సరే సరేలేవే.. దానికి ఇప్పడు క్షమాపణలు ఎందుకు.. నేనుకూడా అంతేగా.. బై.పి.సి ఇద్దరం ఒకే క్లాస్లో చదువుకున్నాం.. తర్వాత నేను యమ్బిబియస్. చేరాను.. అందులో పడి సరిగా నీకు ఫోన్ చేయడం కూడా మానేశాను. ఏది ఏమైనా మనం బాగుండటం కావాలి… ఎలా ఉన్నావు? రూప.. అంతా హ్యాపీనేగా..’ అంది వనజ తన ఇంటర్ కాలేజ్ ని గుర్తు చేసుకుంటూ.
‘ఆ… అన్హ్యాపీ ఆన్ ది వే.. నా లైఫ్ లో.. నాన్న చూస్తే ఏమో షుగర్ పేషెంట్.. ఈ మధ్య బాగా డల్ అయ్యాడు.. ఇక మా ఆయన చూస్తే తనకి కిడ్నీ ప్రాబ్లం.. డాక్టర్ కొడుకుకదా.. ఆరోగ్యం విషయంలో చాలా పద్దతిగా ఉంటాడనుకుంటే.. పార్టీలని.. ఫంక్షన్లని.. మందలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు తనతోపాటు నేను అనుభవిస్తున్నాను.. అది సరేగాని.. నీ..విషయం చెప్పు… అప్పట్లో నీవు దైవాన్ని నమ్మేదానివికాదు కదా!.. మరిప్పుడు బెంగుళూరు నుండి వచ్చి ఇక్కడ పూజలు చేయిస్తున్నావ్…. ఈ మార్పుకు కారణం తెలుసుకోవచ్చా..’ అంది రూప ఆత్రుతగా.
‘అదో అక్కడ పూజారితో మాట్లాడుతున్నాడే.. విజయ్.. ఆయనే.. మా ఆయన. నన్ను దైవం వైపు మళ్లించాడు’ అంది వనజ పూజా సామాగ్రి వివరాలు తెలుసుకుంటున్న విజయ్ ని చూపిస్తూ. విజయ్ ని చూసిన రూపకు గతం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది.
‘ఏంటే.. మా ఆయన్ను చూపిస్తే మాట్లాడటం మానేసి.. మౌనంగా ఉండిపోయావు… నా మార్పుకు కారణం చెబుతా విను… సరిగ్గా మూడేళ్ల క్రితం.. ఈ ఆలయం ముందు.. లెఫ్ట్ సైడ్ నుండి నేను కార్లో వెళుతున్నాను… రైట్ సైడ్ నుండి ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ వేగంగా డివైడర్ను ఢీకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. దానికి.. నాకు.. పది అడుగులే దూరం.. విజయ్ సరిగ్గా అదే సమయంలో రోడ్డు దాటుతూ.. నా కారు ముందు పడిపోవడంతో.. నేను సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
ఆ ఘటన గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ.. నా ఒళ్ళు వణికి పోద్ది.. విజయ్ నా కారుకు అడ్డురాకుంటే.. నేను ఆ ట్రక్కుకు బలైపోయేదాన్ని… ఈ దైవమే విజయ్ రూపంలో నాకు పునర్జన్మ ఇచ్చాడని గట్టి నమ్మకం అప్పుడే ఏర్పడింది. తర్వాత.. ఆ సంఘటన నుండి తేరుకున్నాక “ఎందుకు అలా నా కారు ముందు పడ్డావు” అని అడిగాను “నా కల కల్లగా మిగలడంతో జీర్ణించుకోలేక మనోవేదనకు గురై స్పృహ తప్పి పడిపోయా” అని తనకు జరిగిన విషయం అంతా వివరించాడు విజయ్.
ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను, ఇలాంటి వ్యక్తికి ప్రస్తుత రోజుల్లో హెచ్ఐవి ఉండే అవకాశమే లేదనిపించి మరొకసారి అన్ని టెస్టులు దగ్గరుండి చేయించాను. అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి.. విజయ్ గురించి అంతా తెలుసుకున్న నాకు.. ఆ అమ్మాయి ఎవరో దురదృష్టవంతురాలనిపించింది.. విజయ్ పై నాకు సానుభూతి, ప్రేమ కలిగాయి.. ఆ తర్వాత.. మా డాడీ విజయ్ అమ్మా నాన్నతో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేశారు.
నా లైఫ్ లో జరిగిన మరువలేని ఘటన.. విధి నిర్ణయం విజయ్ నా జీవిత భాగస్వామి అయ్యాడు.’ అంది వనజ దైవానికి నమస్కరిస్తూ..
‘ఏమైనా నీవు అదృష్టవంతురాలివి… ఇప్పుడే నీవన్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదు నేనే వనజ.. అవును… మా ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ తన స్వార్థంతో నన్ను అతని కోడల్నిచేసుకోవాలని, మా అమ్మా నాన్నకు ఉన్న ఆరోగ్య జాగ్రత్తలను అవకాశం గా తీసుకుని.. విజయ్ కి బ్లడ్ టెస్ట్ లో హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిందని మా నాన్నను నమ్మించాడు.
ఈ మధ్య.. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న తన కొడుకుని.. అంటే మా ఆయన్ని చూసి పశ్చాతాపంతో తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని నాకు తనే చెప్పాడు’ అని బోరున విలపించింది రూప.
‘ఊరుకోవే… జరిగిందేదో జరిగిపోయింది.. మీ ఆయనకు తప్పకుండా నయమవుతుంది.. పేరుగాంచిన కిడ్నీ స్పెషలిస్ట్ నా హాస్పిటల్లో ఉన్నారు. మీ..ఆయన్ను బెంగుళూరుకు తీసుకురా.. అక్కడ అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను’ అంటూ ప్రసిద్ధమైన పూజకై పూజారి పిలవడంతో విజయ్ తో పాటు గర్భగుడి వైపు నడిచింది వనజ.
ఈ కాలంక్రీడలో కర్మ ఫలితం మనుషులను ఏ రూపాన ఎలా నడిపిస్తుందో, ఎలా జీవిత గమ్యం చేర్చుతుందో ఎవరికీ తెలియదు.
* * **

రూపారాధన (కథ) – డాక్టర్ బద్రి. పీర్ కుమార్
‘చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావుగా… ఎందుకు సిగ్గు పడుతూ.. ఓరకంటిలో చూస్తున్నావ్!..’ పెళ్ళి పీటల మీద వరుడుగ వధువు రూపతో అన్నాడు విజయ్ సిగ్గుపడుతూనే.. ‘ఆ.. అవును నీ ముఖం చూస్తేనే సిగ్గేస్తుంది. సరెసరే… ముందు పంతులు చెప్పే మంత్రాలు పలుకుదాం… మిస్ చేసామంటే… మంత్రాల పవర్ తగ్గి లైఫ్లాంగ్ ఫైటింగ్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది’ అందిరూప. ‘అవునవును’ అంటూ విజయ్ కళ్ళు తెరచి చూడగానే ఎదురుగా ఉన్న బెడ్ పై బెడ్షీట్ మడతేస్తున్న అమ్మ రుక్మిణిని చూసి ‘అమ్మా… అప్పుడే తెల్లారిందా!… ‘ఆc.. తెల్లారక నీవు కలలు కంటూ ఉండమని పొద్దు ఆగుతుంది మరీ!.. అయినా ఆ రూప నీకు ఎంత అపురూపమైతే మాత్రం మరీ.. ఆ కలవరింపులు ఏంట్రా… ఇదో.. నీ ఆరాటం చూడలేక నీ కోరిక మేరకు నేను మీనాన్న ఆ రూప ఇంటికెళ్లి… మా అబ్బాయి.. మీ అమ్మాయి.. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్ట పడుతున్నాడు.. ఆస్థి అంతస్తుల్లో మీకన్నా ఏమాత్రం తీసిపోము.. అని బ్రతిమాలుకొని మొన్ననే నీపెళ్ళి ఆ రూపతో ఫిక్స్ చేసకున్నాంకదా.. నిజం చెప్పాలంటే ఈ సంబంధం మాకిష్టం లేదు.. ఆ రఘరాం ఉన్నాడే.. అదే నీకు కాబొయె మామగారు.. మహాగర్విష్టి.. ఎదుటివారిని గౌరవించటం తెలియదా!… కనీసం కూర్చొమనికూడా చెప్పడు… మేమేం తుక్కువా?.. ఆయనగారు చెప్పేదేముందని మేమే దర్జాగా కూర్చొని మాట్లాడాం.. అంది రుక్మిణి కాస్త అసహనంగా. ‘అమ్మా… నా కోసం నా ఆనందం కోసమేకదా.. మీ శ్రమంతా.. అయితే ఇప్పుడేమైంది అన్నాడు విజయ్. ‘అసలు విషయం నీకు తెలియదురా.. ఆ రూపావాళ్ల అమ్మా నాన్న ఒక కండీషన్ పెట్టారు’ అంది రుక్మిణి. ‘పెళ్లికి ఓకే అన్నాక కండీషన్ ఏంటి?… ఇంతకు ఎంటంట… అయినా అవన్ని మీరు చూసుకోండి.. రూపతో నాకు పెళ్లి అయితే చాలు… రూప ఒప్పుకుందిగా అదే నాకు భాగ్యం. అన్నాడు విజయ్. ‘ఆc.. భాగ్యమే.. పెళ్ళికి ముందు నీవు ఏ-టు-జెడ్ ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలట… మనది రెస్టారెంట్ మరియు బార్ నడిపే ఫ్యామిలీఅట.. నికార్స్ గా ఉండడానికి అవకాశాలు తక్కువట.. అన్నిటెస్ట్లు నెగెటివ్ వస్తేనే నీపెళ్ళి జరుగుతుందట. ఆ.. అన్నట్లు చెప్పటం మరచిపోయా.. ఈరోజే చేయించుకోవాలట.. వాళ్ళఫ్యామిలీ డాక్టర్ని 11గంటలకు నిన్ను కలవమన్నారు… ఇదెక్కడ విడ్డూరం.. ఇటువంటివి మన వంశం లోనే ఎప్పుడయినా జరిగాయా..?’ అంది రుక్మిణి విచారంగా. ‘అమ్మా దీనికే ఇంతలా డీలా పడిపోతే ఎలా.. అయినా నాకేంటీ.. ఆరోగ్యంగానే ఉన్నా కదా.. అన్ని టెస్టుల్లో నెగటివే వస్తుంది… నీవేం కంగారు పడకు … రాబోయే అందమైన కోడలికి హ్యాపీగా వెల్కమ్ చెప్తువుగాని..’ అంటూ చకచక రెడీ అయ్యి రూప వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్. రూప దగ్గరుండి అన్ని టెస్టులు చేయించింది. ‘రిపోర్ట్స్ రావడానికి మరో రెండు గంటలు పడుతుంది’ అన్నాడు డాక్టర్. ‘ఓకే డాక్టర్’ అని చెప్పి రూపతో అలా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి ఫుడ్కోర్ట్ లో కూర్చొని కాఫీ ఆర్డర్ చెప్పి ‘నీవు చెప్పినట్లుగానే అన్ని టెస్ట్లు చేయించుకున్నాను… మరినీవు చేయించుకోవా’ అన్నాడు విజయ్ వినయంగా రూపతో. వెంటనే తను చేయించుకున్న వివిధ రకాల టెస్టులు మరియు రిపోర్ట్లు చుపించింది రూప. అందులో అన్నీ నెగిటివ్ గానే ఉన్నాయి. ‘హెల్త్ టెస్ట్ చేయించుకోవటం మనిషిని అనుమానించటానికో.. అవమానించటానికో కాదు. ఆరోగ్యకరమైన సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నిబంధన మరియు మన సామాజిక బాధ్యత’ అంది రూప. ‘యస్ వందశాతం నీవు చెప్పింది కరెక్ట్ రూప… ఆరోగ్యంగా లేని వారికి మరొకరికి జన్మనిచ్చే అర్హత లేదు. మన గవర్నమెంట్ దీన్ని చట్టం చేస్తే చాలా బాగుంటుంది. సరేసరే… మాటల్లో పడి రెండుగంటలు దాటిపోయింది. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి వెళ్దాంపదా..’ అంటూ విజయ్ ఉత్సాహంగా రూప చేయి పట్టుకొని నడుచుకుంటూ రిపోర్ట్ డిస్పాచ్ సెంటర్ సమీపానికి వచ్చేలోపల రఘరామ్ కారు సర్రునవచ్చి వీరికి ఎదురుగా ఆగింది. ‘నాన్నా… విజయ్ కి అన్ని టెస్టులు చేయించాను. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి తీసుకుని వచ్చేస్తాను.’ విజయ్ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు అనే నమ్మకంతో ఆనందంగా చెప్పింది రూప. ‘అక్కర్లేదు… ఇప్పుడే మన డాక్టర్ సుకుమార్ ఫోన్ చేశాడు.. బార్లు, పబ్బులు.. నడిపే వారి సంబంధం… నేను ముందే వూహించా… ఆయినా మనకెందుకులే… ఇతనితో నీ పెళ్లి జరగదు. ముందు నీవు కారెక్కు.. అన్ని విషయాలు చెబుతాను’ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోర్సుగా రూప చేయి పట్టుకుని కారెక్కించి తీసుకెళ్ళాడు రఘరాం. జరుగుతున్న ఈ హఠాత్పరిణామం చూస్తున్న విజయ్కు షాక్ తగిలినట్లు నోటి నుండి మాట రాలేదు. రెండు నిమిషాల తర్వాత తనను తాను సముదాయించుకొని, అసలు రిపోర్ట్లో విషయం ఏముందో తెలుసుకుందామని కంగారు పడుతూ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్. ‘హెచ్.ఐ.వి. పాజిటివ్ వచ్చింది.. నాకు తెలిసి ఈ సంవత్సరానికి నీది రెండవ కేసు… డోంట్ వర్రీ…. ఈ ప్రిస్కిప్సన్ ఫాలో అయితే లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు!.. జాలిగా అన్నాడు డాక్టర్ సుకుమార్. విజయ్ నిర్ఘాంత పోయాడు. ‘నన్ను ఇష్టపడ్డ సంబంధాలను అశ్రద్ధచేసి, నాకు ఇష్టమైన రూప కోసం తపించాను… నా కోసం మా అమ్మానాన్నలు వారి ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి రఘురాంను ప్రాదేయపడి ఒప్పించారు… ఇప్పుడు ఈ విషయం వారికి తెలిస్తే తట్టుకోలేరు..’ అనుకుంటూ తీవ్ర మనస్తాపంతో రోడ్డు దాటుతూ అటుగా వస్తున్న కార్ ను ఢీకొన్నాడు. # ### అది మహిమ కలిగిన ఆంజనేయస్వామి దేవాలయం. ఓ రోజు మంగళవారం ఉదయం ఏడు గంటలకు పూజలు చేయుస్తూ ఉంది డాక్టర్ వనజ. ‘వనజా!… నీవు పూజలు చేయించటం చూస్తుంటే!.. ఆశ్చర్యంగా ఉంది.. ఏంటీ బెంగళూరులో హాస్పిటల్ పెట్టావంటగా.. బాగా మారిపోయావు.. సారీ..వే.. నేనప్పుడు.. కొన్ని అనివార్య కారణాల వల్ల అమెరికా వెళ్లడంతో నీ పెళ్ళికి రాలేకపోయాను. ఆ గిల్టీ ఫీలింగ్తోనే.. తర్వాత.. నేను నీకు ఫోన్ కూడా చేయలేక పోయాను.. నన్ను క్షమించు..’ అంది దైవారాధనకు వచ్చిన రూప వనజతో. ‘సరే సరేలేవే.. దానికి ఇప్పడు క్షమాపణలు ఎందుకు.. నేనుకూడా అంతేగా.. బై.పి.సి ఇద్దరం ఒకే క్లాస్లో చదువుకున్నాం.. తర్వాత నేను యమ్బిబియస్. చేరాను.. అందులో పడి సరిగా నీకు ఫోన్ చేయడం కూడా మానేశాను. ఏది ఏమైనా మనం బాగుండటం కావాలి… ఎలా ఉన్నావు? రూప.. అంతా హ్యాపీనేగా..’ అంది వనజ తన ఇంటర్ కాలేజ్ ని గుర్తు చేసుకుంటూ. ‘ఆ… అన్హ్యాపీ ఆన్ ది వే.. నా లైఫ్ లో.. నాన్న చూస్తే ఏమో షుగర్ పేషెంట్.. ఈ మధ్య బాగా డల్ అయ్యాడు.. ఇక మా ఆయన చూస్తే తనకి కిడ్నీ ప్రాబ్లం.. డాక్టర్ కొడుకుకదా.. ఆరోగ్యం విషయంలో చాలా పద్దతిగా ఉంటాడనుకుంటే.. పార్టీలని.. ఫంక్షన్లని.. మందలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు తనతోపాటు నేను అనుభవిస్తున్నాను.. అది సరేగాని.. నీ..విషయం చెప్పు… అప్పట్లో నీవు దైవాన్ని నమ్మేదానివికాదు కదా!.. మరిప్పుడు బెంగుళూరు నుండి వచ్చి ఇక్కడ పూజలు చేయిస్తున్నావ్…. ఈ మార్పుకు కారణం తెలుసుకోవచ్చా..’ అంది రూప ఆత్రుతగా. ‘అదో అక్కడ పూజారితో మాట్లాడుతున్నాడే.. విజయ్.. ఆయనే.. మా ఆయన. నన్ను దైవం వైపు మళ్లించాడు’ అంది వనజ పూజా సామాగ్రి వివరాలు తెలుసుకుంటున్న విజయ్ ని చూపిస్తూ. విజయ్ ని చూసిన రూపకు గతం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది. ‘ఏంటే.. మా ఆయన్ను చూపిస్తే మాట్లాడటం మానేసి.. మౌనంగా ఉండిపోయావు… నా మార్పుకు కారణం చెబుతా విను… సరిగ్గా మూడేళ్ల క్రితం.. ఈ ఆలయం ముందు.. లెఫ్ట్ సైడ్ నుండి నేను కార్లో వెళుతున్నాను… రైట్ సైడ్ నుండి ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ వేగంగా డివైడర్ను ఢీకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. దానికి.. నాకు.. పది అడుగులే దూరం.. విజయ్ సరిగ్గా అదే సమయంలో రోడ్డు దాటుతూ.. నా కారు ముందు పడిపోవడంతో.. నేను సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ ఘటన గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ.. నా ఒళ్ళు వణికి పోద్ది.. విజయ్ నా కారుకు అడ్డురాకుంటే.. నేను ఆ ట్రక్కుకు బలైపోయేదాన్ని… ఈ దైవమే విజయ్ రూపంలో నాకు పునర్జన్మ ఇచ్చాడని గట్టి నమ్మకం అప్పుడే ఏర్పడింది. తర్వాత.. ఆ సంఘటన నుండి తేరుకున్నాక “ఎందుకు అలా నా కారు ముందు పడ్డావు” అని అడిగాను “నా కల కల్లగా మిగలడంతో జీర్ణించుకోలేక మనోవేదనకు గురై స్పృహ తప్పి పడిపోయా” అని తనకు జరిగిన విషయం అంతా వివరించాడు విజయ్. ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను, ఇలాంటి వ్యక్తికి ప్రస్తుత రోజుల్లో హెచ్ఐవి ఉండే అవకాశమే లేదనిపించి మరొకసారి అన్ని టెస్టులు దగ్గరుండి చేయించాను. అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి.. విజయ్ గురించి అంతా తెలుసుకున్న నాకు.. ఆ అమ్మాయి ఎవరో దురదృష్టవంతురాలనిపించింది.. విజయ్ పై నాకు సానుభూతి, ప్రేమ కలిగాయి.. ఆ తర్వాత.. మా డాడీ విజయ్ అమ్మా నాన్నతో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నా లైఫ్ లో జరిగిన మరువలేని ఘటన.. విధి నిర్ణయం విజయ్ నా జీవిత భాగస్వామి అయ్యాడు.’ అంది వనజ దైవానికి నమస్కరిస్తూ.. ‘ఏమైనా నీవు అదృష్టవంతురాలివి… ఇప్పుడే నీవన్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదు నేనే వనజ.. అవును… మా ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ తన స్వార్థంతో నన్ను అతని కోడల్నిచేసుకోవాలని, మా అమ్మా నాన్నకు ఉన్న ఆరోగ్య జాగ్రత్తలను అవకాశం గా తీసుకుని.. విజయ్ కి బ్లడ్ టెస్ట్ లో హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిందని మా నాన్నను నమ్మించాడు. ఈ మధ్య.. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న తన కొడుకుని.. అంటే మా ఆయన్ని చూసి పశ్చాతాపంతో తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని నాకు తనే చెప్పాడు’ అని బోరున విలపించింది రూప. ‘ఊరుకోవే…

