Monday, 23 March 2026
  • Home  
  • రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు
- తిరుపతి

రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశమునకు తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నరు. సమావేశంలో YS షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పథకం VB గ్రామ్ జీ పథకం వల్ల నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందని, రాబోవు రోజుల్లో ఆ పథకంపై నిరసన తెలుపుతూ జిల్లాల పర్యటన కార్యక్రమం తో ప్రజలకు చేరువై ఉపాధి హామీ పథకం యొక్క విశిష్టతను తెలియజేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్ల హరి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీతారామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివశంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.