* తిరుపతిలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో ఏ జి టి యు పి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ
* “గాండ్ల కార్పొరేషన్” పై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి
*తిరుపతి :* గురువులను స్మరించుకోవడం, ఉత్తమ గురువులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం (ఏ జి టి యు పి ఎస్ ఎస్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని ఏజిటియుపిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.. 2025లో భాగంగా అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం- తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్ నందు గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షులు కందాటి రామిశెట్టి
సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ
విశిష్ట అతిథిగా, తిరుపతిలోని
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్స్లర్ సరోజమ్మ, డిఎస్పి (తిరుపతి) వి.శ్రీనివాసులు,
రెడ్డి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి
రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ మాట్లాడుతూ, మన గాండ్ల కులంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం చాలా గర్వకారణమన్నారు. అలాగే, గాండ్ల కులస్తులకు కార్పొరేషన్ రావడంలో చాలా ఆలస్యం జరుగుతున్నదని, దీంతో యువత చాలా నష్టపోతున్నారని అన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వము గాండ్ల కులస్తుల కోసం కార్పొరేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామని, త్వరగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, డి భాస్కర్, (కోశాధికారి, తిరుపతి),
టి.చంద్రశేఖర్ (వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి) రాష్ట్ర నాయకులు గిరి శ్రీనివాస్,
ఆర్కాట్ హేమాద్రి, మురళి,
పూజారి, సుధాకర్ బాబు తదితరులు తమ సందేశాలు ఇచ్చారు. గాండ్ల తెలికుల అభివృద్ధి సంక్షేమానికి సమష్టగా కృషి చేస్తూ, గాండ్ల కార్పొరేషన్ కోసం, అలాగే తిరుపతిలో ఏజిటియుపిఎస్ఎస్ భవనం ఏర్పాటుకు అందరి సహాయ సహకారాలతో కార్యరూపంలోకి తీసుకొద్దామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గాండ్ల కుల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.


