ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యం లో,నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో శని, ఆది వారాల లో నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ముని నాగలక్ష్మి స్మారక రాష్ట్రస్థాయి రాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి నిర్వహణలో, ముని నాగలక్ష్మి సోదరుడు, నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ట్రికల్ శాఖధిపతి, టోర్నమెంట్ డైరెక్టర్ రాజేష్ సౌజన్యంతో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన వారు తమ కృషి కొనసాగించాలని, జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. గెలవని వారు క్రమశిక్షణతో నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించవచ్చున్నారు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ రాజేష్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, డాక్టర్ నీలా ప్రసాద్, జిల్లా వైద్యశాఖ ఏవో డాక్టర్ భరత్ ,ఆంధ్ర రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి మరియు జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు సుజాత, జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు రాజా రమేష్ చక్రవర్తి, ఇమామ్,కర్నూలు జిల్లా చెస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా చెస్ ప్రెసిడెంట్ కొండారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్ లు పాల్గొన్నారు రాష్ట్రస్థాయి విజేతలు రాపిడ్ విభాగంలో
ప్రథమ స్థానం శివ పవన్ తేజ శర్మ (ఎన్టీఆర్ జిల్లా),రెండవ స్థానం లక్షిత్ (కర్నూల్ జిల్లా) సాధించగా,బ్లిట్జ్ విభాగంలో
మొదటి స్థానం సాత్విక్ (కోనసీమ జిల్లా), రెండవ స్థానం రామచరణ్ తేజ (తూర్పుగోదావరి జిల్లా) సాధించారు.ఎన్.ఆర్.జి చెస్ అకాడమీ విభాగంలో నీలేష్ ,శాలిని స్థానాలు పొందారు.

రాష్ట్రస్థాయి చెస్ పోటీల బహుమతులు అందజేసిన డాక్టర్ రవికృష్ణ
ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యం లో,నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో శని, ఆది వారాల లో నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగిన ముని నాగలక్ష్మి స్మారక రాష్ట్రస్థాయి రాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి నిర్వహణలో, ముని నాగలక్ష్మి సోదరుడు, నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ట్రికల్ శాఖధిపతి, టోర్నమెంట్ డైరెక్టర్ రాజేష్ సౌజన్యంతో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన వారు తమ కృషి కొనసాగించాలని, జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. గెలవని వారు క్రమశిక్షణతో నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించవచ్చున్నారు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ రాజేష్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, డాక్టర్ నీలా ప్రసాద్, జిల్లా వైద్యశాఖ ఏవో డాక్టర్ భరత్ ,ఆంధ్ర రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి మరియు జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు సుజాత, జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు రాజా రమేష్ చక్రవర్తి, ఇమామ్,కర్నూలు జిల్లా చెస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా చెస్ ప్రెసిడెంట్ కొండారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్ లు పాల్గొన్నారు రాష్ట్రస్థాయి విజేతలు రాపిడ్ విభాగంలో ప్రథమ స్థానం శివ పవన్ తేజ శర్మ (ఎన్టీఆర్ జిల్లా),రెండవ స్థానం లక్షిత్ (కర్నూల్ జిల్లా) సాధించగా,బ్లిట్జ్ విభాగంలో మొదటి స్థానం సాత్విక్ (కోనసీమ జిల్లా), రెండవ స్థానం రామచరణ్ తేజ (తూర్పుగోదావరి జిల్లా) సాధించారు.ఎన్.ఆర్.జి చెస్ అకాడమీ విభాగంలో నీలేష్ ,శాలిని స్థానాలు పొందారు.

