పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 7, (పున్నమి ప్రతినిధి):
రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ లకు చెక్ పవర్ ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నుకున్న ప్రజలకు సర్పంచులు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. జడ్పిటిసి ఆంజనేయులు మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఈవోఆర్డీ వెంకటేష్ పాల్గొన్నారు.

