Friday, 6 February 2026
  • Home  
  • రామారెడ్డి పీహెచ్సీలో హెచ్ఐవి, ఎయిడ్స్‌, టిబి, హెపటైటిస్‌పై అవగాహన
- కామారెడ్డి

రామారెడ్డి పీహెచ్సీలో హెచ్ఐవి, ఎయిడ్స్‌, టిబి, హెపటైటిస్‌పై అవగాహన

కామారెడ్డి, 6 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్, టిబి, ఎస్టీఐ, హెపటైటిస్ బి, సి, 1097 సేవలు, సిఫిలిస్ తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఇప్పటివరకు కొనసాగుతున్న ఐసీటీసీ సేవలతో పాటు, కొత్తగా ప్రారంభించిన సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా హెచ్ఐవి సేవలతో పాటు పైన పేర్కొన్న అన్ని వ్యాధులకు సంబంధిం చిన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. అవసరమయ్యే వారికి రెండు సంవత్సరాల పాటు నిరంతర ఫాలోఅప్ చేస్తూ పరీక్షలు, చికిత్సలు, మందులు, కౌన్సెలింగ్, ఇతర అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని వివరించారు.రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు లో, ప్రస్తుత సేవలు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలు ఈ ఉచిత సేవలను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్లు భీమన్న, జార్జ్, సూపర్వైజర్ జానకి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఎస్‌కే ORW, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి, 6 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్, టిబి, ఎస్టీఐ, హెపటైటిస్ బి, సి, 1097 సేవలు, సిఫిలిస్ తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఇప్పటివరకు కొనసాగుతున్న ఐసీటీసీ సేవలతో పాటు, కొత్తగా ప్రారంభించిన సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా హెచ్ఐవి సేవలతో పాటు పైన పేర్కొన్న అన్ని వ్యాధులకు సంబంధిం చిన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. అవసరమయ్యే వారికి రెండు సంవత్సరాల పాటు నిరంతర ఫాలోఅప్ చేస్తూ పరీక్షలు, చికిత్సలు, మందులు, కౌన్సెలింగ్, ఇతర అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని వివరించారు.రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు లో, ప్రస్తుత సేవలు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలు ఈ ఉచిత సేవలను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్లు భీమన్న, జార్జ్, సూపర్వైజర్ జానకి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఎస్‌కే ORW, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.