తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 30 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :
రామవరంలో “ఆత్మ నిర్భర్ భారత్” సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము.
అనపర్తి మండలం రామవరం లో SVR ఫంక్షన్ హల్ లో “ఆత్మ నిర్భర్ భారత్” సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బిజెపి నాయకులు కాశీ, శ్రీవిద్య, రజిని, హారిక, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, తెలుగు మహిళలు.
ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
ఈరోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశముగా అన్ని విధాలుగా భారతదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళుతున్న నేపథ్యంలో ఇవాళ అనేక శక్తులు భారతదేశాన్ని బలహీన పరచాలనే ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న విషయాన్ని ఇప్పటికే అందరూ గ్రహించారు.
ముఖ్యంగా ఇవాళ రక్షణ రంగంలో గానీ, ఆర్థిక రంగంలో గానీ, ఏ విధంగా ప్రగతి సాధించింది అనేది మీ అందరికీ తెలుసు అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా రక్షణ రంగంలో మనం ఎంత బలంగా ఉన్నాము అనేది పాకిస్తాన్ కే కాదు ప్రపంచానికే చాటి చెప్పిన నేపథ్యంలో అనేక రంగాలపైన మనపై అసూయ కలుగుతున్న నేపథ్యంలో దానిని గమనించుకొని ఇవాళ మన ఆర్థిక విధానం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది చూశారు, ఇవాళ భారతదేశం చైనాను మించి దూసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం.
అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన ఆర్థిక రంగానికి ఊతం ఇవ్వాలి మన ఆర్థిక రంగాన్ని స్వదేశీ ఉత్పత్తులని వినియోగించాలి దాని ద్వారా మన ఆర్థిక రంగానికి చేయూతనివ్వాలి ప్రతి ఒక్కరూ స్వదేశీ నినాదం ద్వారా స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
భారతదేశ స్వాతంత్ర సమరంలో బాలగంగాధర్ తిలక్ గారు తీసుకున్న స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మన రోజు వారి జీవితంలో వీలైనంతవరకు భారతీయ ఉత్పత్తులను వినియోగించాలి దిగుమతి చేసుకునే వస్తువులకు బదులుగా మనం పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులను వాడాలి అనేది మన అందరం ఆలోచన చేయాలి అనేది వారు చెప్పడం జరిగింది.
అదేవిధంగా మన ఇంట్లో గాని, పనిలో గాని, సమాజంలో గాని భారతీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా మనదేశ రైతాంగానికి మన సహకారం అందించాలి చేతి వృత్తి కళాకారులకు మన సహకారం అందించాలి వారిని ప్రోత్సహించాలి, అదేవిధంగా యువతకి, పిల్లలకి ఇవ్వాళ విదేశీ భావాల నుంచి స్వదేశీ భావాలను అలవరచే విధంగా మనమందరం కృషి చేయాలి. అదేవిధంగా కుటుంబ జీవనంలో గాని, సామాజిక జీవనంలో గాని వినియోగిస్తూ మన భారతీయతను చాటి చెప్పాలి అని విషయంలో కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు శ్రద్ధ తీసుకోవడం జరుగుతా ఉంది.
అన్నింటికీ మించి ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు చాటి చెబుతున్నారు. ముఖ్యంగా పకృతి పరిరక్షణ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం ప్రధానమైనది. పకృతి పరిరక్షణ ధ్యేయంగా భారతీయ సంస్కృతి ని మనం నిర్మించుకోవడం జరిగింది అటువంటిది ఇవాళ మనం పకృతిని నాశనం చేసుకునే దశగా పర్యావరణానికి వేగoగా దూరం కలిగించే దిశగా అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షించుకోవాలి తద్వారా మానవాళి జీవన మనుగడని ఆరోగ్యకరంగా జీవించడం కోసం ప్రకృతి పరిరక్షణ కోసం మనందరం పునరంకితం కావాలి అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది.
ముఖ్యoగా జన్మభూమి హల్ట్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా ఎంపీ గారు అనపర్తి విచ్చేయడం జరిగింది. జన్మభూమి హల్ట్ అనేది మన ప్రాంతానికి ఎంత ముఖ్యమో మీ అందరికి తెలుసు. మొన్న విజయవాడలో ఎంపీ గారితో ఒక మాట అన్నా ఐదు సంవత్సరాలలో చేయాల్సిన పనిని మొదటి సంవత్సరంలో చేసారని, అంత విలువైన వ్యవహారం అది. దాన్ని ఈవేళ చాకచక్యంగా సంవత్సరం కాలం తిరగకుండా జన్మభూమి హల్ట్ తీసుకువచ్చి ఎంపీ శ్రీమతి పురందేశ్వరి గారికి అనపర్తి నియోజకవర్గం తరుపున, ఈ చుట్టు ప్రక్కల నియోజకవర్గాల తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్న, ఇక్కడ ఈ ప్రాంతంలో మూడు రైల్వే ఫ్లైఓవర్స్ మంజూరు అయిన, బిక్కవోలు ఫ్లైఓవర్ ను అమృత్ పథకంలో చేర్చడానికి అంగీకరించడం ఇవన్నీ గౌరవ ఎంపీ గారి కృషి వల్ల మాత్రమే అని తెలియచేస్తున్నాను.
వారు మనకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు, వారు విదేశాల్లో ఉన్న నిరంతరం అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గం సమస్యల పరిస్కారం కోసం వారు నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, వారు ఈవేళ మహిళల కార్యక్రమానికి రావడం సుదినంగా భావిస్తూ, అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వారికి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్న వాటిన్నిటిని త్వరగా ముగించుకుని ఈ కార్యక్రమానికి రావడo జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళమణులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, నాలుగు మండలాల మహిళలు పాల్గొన్నారు.


