Tuesday, 3 March 2026
  • Home  
  • రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది.
- ఖమ్మం

రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది.

T.Ravinder పున్నమి న్యూస్ 3/3/2026 ఖమ్మం రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. మంగళవారం తొమ్మిది మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ తొమ్మిది మందిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉండటం విశేషం…* నితిన్ నబిన్ బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. 2026, ఫిబ్రవరి 18వ తేదీన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. *10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.* ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో *తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవులు ముగియనున్నాయి.* వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. *బీజేపీ అభ్యర్థులు వీరే…* 1. నితిన్ నబిన్ (బిహార్) 2. శివేష్ కుమార్ (బిహార్) 3. తేరష్ గోవాలా (అస్సాం) 4. జొగెన్ మోహన్ (అస్సాం) 5. లక్ష్మి వర్మ (ఛత్తీస్‌గఢ్) 6. సంజయ్ భాటియా (హరియాణా) 7. మన్మోహన్ సామేల్ (ఒడిశా) 8. సుజీత్ కుమార్ (ఒడిశా) 9. రాహుల్ సిన్హా (పశ్చిమ బెంగాల్)

T.Ravinder
పున్నమి న్యూస్
3/3/2026
ఖమ్మం

రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. మంగళవారం తొమ్మిది మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ తొమ్మిది మందిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉండటం విశేషం…* నితిన్ నబిన్ బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. 2026, ఫిబ్రవరి 18వ తేదీన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. *10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.* ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో *తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవులు ముగియనున్నాయి.* వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది.

*బీజేపీ అభ్యర్థులు వీరే…*

1. నితిన్ నబిన్ (బిహార్)

2. శివేష్ కుమార్ (బిహార్)

3. తేరష్ గోవాలా (అస్సాం)

4. జొగెన్ మోహన్ (అస్సాం)

5. లక్ష్మి వర్మ (ఛత్తీస్‌గఢ్)

6. సంజయ్ భాటియా (హరియాణా)

7. మన్మోహన్ సామేల్ (ఒడిశా)

8. సుజీత్ కుమార్ (ఒడిశా)

9. రాహుల్ సిన్హా (పశ్చిమ బెంగాల్)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.