Thursday, 5 February 2026
  • Home  
  • రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం! ప్రింటింగ్లోనూ తప్పులే
- ఆంధ్రప్రదేశ్

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం! ప్రింటింగ్లోనూ తప్పులే

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ జాయింట్ ఎల్పీఎం నంబర్లతోనే ముద్రణ ఫొటోలు, పేర్లు, విస్తీర్ణంలోనూ తేడాలు రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే.. అచ్చువేయించిన రెవెన్యూశాఖ కొత్తవి ఇచ్చినా.. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే సరిహద్దు రాళ్లనే కాదు, రైతుల పట్టాదారు పాస్పుస్తకాలపైనా నాటి ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మలేసుకున్నారు. హడావుడిగా సర్వే చేయడంతోపాటు విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు ఉన్నా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మను తొలగించి.. రాజముద్రతో కొత్త పాస్పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది రైతులకు సంతోషం కలిగించే అంశమే అయి వాటిలో తప్పులు చూస్తేనే.. ఆందోళన కలుగుతోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరిదిద్దకుండానే కొత్త పుస్తకాల్ని ప్రింట్ చేయించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాలు జిల్లాలకు చేరాయి. వాటిని పరిశీలిస్తే 50శాతం తప్పులే ఉన్నట్లు తేలింది. జాయింట్ ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యలూ ఎక్కువే. ఇద్దరు ముగ్గురు రైతుల పేర్లతో ఐదు, పదెకరాలు నమోదు చేశారు. వాటిని విభజించలేదు. ఇవన్నీ సరిచేసుకోవాలంటే మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. వెబ్ల్యండ్లో తప్పులు… ఏడాదైనా సరిచేయకుండా రీసర్వే సమయంలో వెబ్ల్యండ్లో కుప్పలకొద్దీ తప్పులు నమోదయ్యాయి. విస్తీర్ణాల్లోనూ పెద్దఎత్తున తేడాలొచ్చాయి. ఒక రైతుకు 1.20 ఎకరాలు ఉంటే ఎకరం నమోదు చేశారు. మరో రైతుకు ఎకరం ఉంటే 1.20 ఎకరాలు ఉన్నట్లు రాశారు. సరిచేయాలని అర్జీలు పెట్టుకున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రైతుల పేర్లలోనూ తప్పులు దొర్లాయి. ఇలాంటివి అనేకం ఉన్నా అలాగే ప్రింటింగ్కు ఇచ్చేశారు. చనిపోయిన వారి పేర్లతోనే పట్టాదారు పాస్పుస్తకాలు ప్రింట్ చేశారు. వారసులు వాటిని తీసుకుని మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి కొత్తవి తీసుకోవాలి. మగవారి పేర్లను ఆడవారిగా, ఆడవారి పేర్లను మగవారిగా మార్చేశారు. కొందరి పేర్లు సగమే ముద్రించి వదిలేశారు. ఆధార్, మొబైల్ నంబర్లలో తప్పులు ఉన్నాయి. కొన్నిచోట్ల కౌలు చేసే వారి పేర్లతో పుస్తకాలు తయారు చేశారు. వీటిని ఇలాగే రైతులకు ఇస్తే.. భూములు అమ్ముకోవాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఇబ్బందులే. సరి చేయించుకోవాలంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ప్రింటింగ్లోనూ తప్పులే రైతుల అంగీకారం తీసుకుంటే.. గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు. ఉన్న పుస్తకంలో మరో రైతు ఫొటో వచ్చింది. పేర్లు మారిపోయాయి. 40వేల పుస్తకాల్లో సమాచారం తప్పుగా ఉంది. 25వేలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాల్లో ఫొటోలు తేడాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే 8వేలకు పైగా ఉన్నాయి. పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వాటిని అలాగే రైతులకు పంపిణీ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరిదిద్దే చర్యలు చేపట్టారు. రైతుల అంగీకారం తీసుకుంటే.. గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
జాయింట్ ఎల్పీఎం నంబర్లతోనే ముద్రణ ఫొటోలు, పేర్లు, విస్తీర్ణంలోనూ తేడాలు రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే..

అచ్చువేయించిన రెవెన్యూశాఖ కొత్తవి ఇచ్చినా.. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే

సరిహద్దు రాళ్లనే కాదు, రైతుల పట్టాదారు పాస్పుస్తకాలపైనా నాటి ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మలేసుకున్నారు. హడావుడిగా సర్వే చేయడంతోపాటు విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు ఉన్నా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మను తొలగించి.. రాజముద్రతో కొత్త పాస్పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది రైతులకు సంతోషం కలిగించే అంశమే అయి వాటిలో తప్పులు చూస్తేనే.. ఆందోళన కలుగుతోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరిదిద్దకుండానే కొత్త పుస్తకాల్ని ప్రింట్ చేయించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాలు జిల్లాలకు చేరాయి. వాటిని పరిశీలిస్తే 50శాతం తప్పులే ఉన్నట్లు తేలింది. జాయింట్ ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యలూ ఎక్కువే. ఇద్దరు ముగ్గురు రైతుల పేర్లతో ఐదు, పదెకరాలు నమోదు చేశారు. వాటిని విభజించలేదు.
ఇవన్నీ సరిచేసుకోవాలంటే మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే.
వెబ్ల్యండ్లో తప్పులు… ఏడాదైనా సరిచేయకుండా
రీసర్వే సమయంలో వెబ్ల్యండ్లో కుప్పలకొద్దీ తప్పులు నమోదయ్యాయి. విస్తీర్ణాల్లోనూ పెద్దఎత్తున తేడాలొచ్చాయి. ఒక రైతుకు 1.20 ఎకరాలు ఉంటే ఎకరం నమోదు చేశారు. మరో రైతుకు ఎకరం ఉంటే 1.20 ఎకరాలు ఉన్నట్లు రాశారు.
సరిచేయాలని అర్జీలు పెట్టుకున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రైతుల పేర్లలోనూ తప్పులు దొర్లాయి. ఇలాంటివి అనేకం ఉన్నా అలాగే ప్రింటింగ్కు ఇచ్చేశారు.
చనిపోయిన వారి పేర్లతోనే పట్టాదారు పాస్పుస్తకాలు ప్రింట్ చేశారు. వారసులు వాటిని తీసుకుని మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి కొత్తవి తీసుకోవాలి.
మగవారి పేర్లను ఆడవారిగా, ఆడవారి పేర్లను మగవారిగా మార్చేశారు. కొందరి పేర్లు సగమే ముద్రించి వదిలేశారు.
ఆధార్, మొబైల్ నంబర్లలో తప్పులు ఉన్నాయి.
కొన్నిచోట్ల కౌలు చేసే వారి పేర్లతో పుస్తకాలు తయారు చేశారు.
వీటిని ఇలాగే రైతులకు ఇస్తే.. భూములు అమ్ముకోవాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఇబ్బందులే. సరి చేయించుకోవాలంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే.

ప్రింటింగ్లోనూ తప్పులే
రైతుల అంగీకారం తీసుకుంటే..
గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు. ఉన్న పుస్తకంలో మరో రైతు ఫొటో వచ్చింది. పేర్లు మారిపోయాయి. 40వేల పుస్తకాల్లో సమాచారం తప్పుగా ఉంది. 25వేలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాల్లో ఫొటోలు తేడాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే 8వేలకు పైగా ఉన్నాయి. పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వాటిని అలాగే రైతులకు పంపిణీ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరిదిద్దే చర్యలు చేపట్టారు.

రైతుల అంగీకారం తీసుకుంటే..
గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.