✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి రాజమండ్రి అమర జీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భం గా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోట గుమ్మం వద్ద గల పొట్టి శ్రీ రాములు విగ్రహనికి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ శ్రీ tk విశవేశ్వర రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగా రావు మరియు ఇతర కాంగ్రెస్డ్ నాయకులు తో కలసి అమర జీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా tk విశవేశ్వర రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీ రాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ద్వారా ఈ రాష్ట్రము ఏర్పడిందని ఆయన నిత్య స్మరనీయుడు అని
అమరావతి లో ఆయన 58 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషంచాల్సిన విషయం అని అన్నారు అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ అమరజీవి లాంటి వ్యక్తి ఈనాటి యువతకు స్ఫూర్తి అని అమరజీవి ఆమరణ దీక్ష వల్లనే తెలుగు రాష్ట్రం ఏర్పడింది అని మనం అంతా అమర జీవి పొట్టి శ్రీరాములును నిత్యం స్మరిచాల్సిన వ్యక్తి అని ఆయన త్యాగం మరువలేనిదని కొనియాడారు, సీనియర్ నాయకులు బెజవాడ మాట్లాడుతూ పొట్టి శ్రీ రాములు గారి ప్రాంతీయ అభిమానం తెలుగువారి పట్ల తెలుగు జాతి పట్ల ఆయన చూపి న అభిమానం వేల కట్టలేనిదని మాట్లాడారు
ఈ కార్యక్రమం లో కూరగంటి శ్రీను, ఆర్ రాజు, మాదేటి బుజ్జి, m పద్మావతి తదితర్లు పాల్గొన్నారు
బాలేపల్లి మురళీధర్,
రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
END…..

