తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది. రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శిగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అబ్దుల్ కరీం షేక్ నియమించినందుకు పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గత కొన్నేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ, తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన శాయశక్తులా కృషి చేశారు అని. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని, కష్టాన్ని గుర్తించి ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించడం గర్వంగా ఉంది అని తెలిపారు.
అధిష్టానానికి కృతజ్ఞతలు:
నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ ను
రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజును
రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ముందుకు సాగే దిశ:
ముస్లిం మైనారిటీల గొంతుకగా ఉంటూనే, రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే రోజుల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు అప్పగించిన ఈ బాధ్యతను ఒక సవాలుగ నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తానని పేర్కొన్నారు.


