రాజంపేట కేంద్రసాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు పట్టణం లోని రాజంపేట కేంద్ర సాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో కలిసి నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి.
రాజంపేట కేంద్ర సాధన కోసం శాంతియుతంగా సాగిన నిరసన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పిల్లల అన్నమయ్య వేషధారణ
అన్నమయ్య వేషధారణతో నిరసన ర్యాలీ, రాజంపేట కేంద్ర డిమాండ్‌కు మద్దతునిస్తూ నిరసనలో పాల్గొన్న అరవ శ్రీధర్ , వరలక్ష్మి.
అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం రైల్వే కోడూరు పట్టణంలో శాంతియుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు జేఏసీ నాయకులతో, పిల్లలతో కలిసి మోకాళ్లపై కూర్చొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌కు మద్దతుగా తమ వంతు నిరసన తెలిపారు. రాజంపేటకు ఉన్న చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి జిల్లా కేంద్ర హోదా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం నిర్వహించిన ర్యాలీలో అన్నమయ్య వేషధారణలో పాల్గొన్న చిన్నారులు రాజంపేట విశిష్టతను చాటిచెప్పేలా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాజంపేట కేంద్ర సాధన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నిరసన ర్యాలీలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ , కాలేజ్ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.


