Friday, 6 February 2026
  • Home  
  • రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు
- ఎన్ టి ఆర్ జిల్లా

రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు

జగ్గయ్యపేట పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురస్క రించుకుని జగ్గయ్యపేట పట్టణం లోని ఉక్కు కళా వేదికలో రక్తదాన శిబిరం జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించబడిం ది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు.అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించిన తర్వాత రక్తదాన శిబిరం ప్రారంభమైంది. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారి అడుగుజాడలో నడిచి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య వంతుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఉత్సాహపరిచారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది ప్రాణదానం తో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, డిసి వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, కౌన్సిలర్లు పేరం సైదేశ్వర రావు, మారేపల్లి శౌరి, బండారు రవి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురస్క రించుకుని జగ్గయ్యపేట పట్టణం లోని ఉక్కు కళా వేదికలో రక్తదాన శిబిరం జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించబడిం ది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు.అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించిన తర్వాత రక్తదాన శిబిరం ప్రారంభమైంది. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారి అడుగుజాడలో నడిచి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య వంతుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఉత్సాహపరిచారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది ప్రాణదానం తో సమానం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, డిసి వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, కౌన్సిలర్లు పేరం సైదేశ్వర రావు, మారేపల్లి శౌరి, బండారు రవి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.