Wednesday, 1 April 2026
  • Home  
  • యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జీజీహెచ్‌లో న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జీజీహెచ్‌లో న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం

నెల్లూరు జిల్లా — పున్నమి ప్రతినిధి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే.వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ద్వారా ప్రతి పౌరుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందగలడని తెలిపారు. అలాగే వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయసహాయం అందించేందుకు 1987 న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హెచ్‌ఓడీ కళారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్‌కే మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా — పున్నమి ప్రతినిధి

హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే.వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ద్వారా ప్రతి పౌరుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందగలడని తెలిపారు. అలాగే వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయసహాయం అందించేందుకు 1987 న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హెచ్‌ఓడీ కళారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్‌కే మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.