Monday, 23 March 2026
  • Home  
  • యువతకు ఆదర్శం ఇమ్రాన్ సోదరులు డిగ్రీ చదివి బెల్లం పానకం పప్పు బండి నిర్వహణ – అభినందించిన జమాఆతె ఇస్లామీ నంద్యాల అమీర్ సమద్
- E-పేపర్

యువతకు ఆదర్శం ఇమ్రాన్ సోదరులు డిగ్రీ చదివి బెల్లం పానకం పప్పు బండి నిర్వహణ – అభినందించిన జమాఆతె ఇస్లామీ నంద్యాల అమీర్ సమద్

చదివు ఉన్నా చదువు లేకున్నా నేడు చాలా మంది యువత కాలం వెలిబుచ్చడం, సెల్ ఫోన్ లలో టైమ్ పాస్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. కొంత మంది తల్లితండ్రులను వేధిస్తూ వయసు వచ్చిన పెద్దలపై ఆధారపడి జీవిస్తు కుటుంబానికి, సమాజానికి భారంగా తయారవుతున్నారు అలాంటి యువతకు నంద్యాల రియాజ్,ఇమ్రాన్ సోదరులు ఆదర్శంగా నిలిచి కుటుంబ పోషణలో తమవంతు కృషి చేస్తున్నారు. ఉద్యోగాలంటు కాలం గడపక, చిన్న పనులంటు సిగ్గు పడక ఆత్మవిశ్వాసంతో తమ కాళ్ళపై తాము నిలబడటానికి సిద్ధం అయ్యారు, టెక్కే గిరినాధ్ సెంటర్కు చెందిన ఇమ్రాన్ సోదరులు బెల్లం పానకం పప్పు తయారు చేసి బండి పై అమ్ముతున్నారు. తమ తండ్రి సోను పాపిడి అమ్మెవాడు,గత అయిదు సంవత్సరాల క్రితం మరణిస్తే ఇంటి పోషణ భారం తమపై వేసుకొని ముందుకు సాగుతున్నారు. తండ్రి అనుభవం పుణికి తెచ్చుకొని రోజు ఇంటి వద్ద ‘బెల్లం పానకం పప్పు’ తయారు చేసి స్థానిక పద్మావతి నగర్ లో నంది మిల్క్ సెంటర్ వద్ద బండి పై అద్దం బాక్స్ లో ఉంచి ఇమ్రాన్ విక్రయిస్తాడు, అన్న రియాజ్ ఇంటి వద్ద స్వెచ్ఛమైన బెల్లం పాకంలో వేరుశనగ పప్పు వేసి కమ్మని పానకం పప్పు తయారు చేస్తారు. వారి కృషిని నిరాడంబర వ్యాపార సరళిని సందర్శించిన నంద్యాల జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అభినందించారు. బెల్లం పానకం పప్పు టేస్టు వల్ల రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పది కేజీలు అమ్ముతామని, చాలా మంది ఆరోగ్యం, బలం కోసం రోజు వచ్చి తీసుకొని తింటారని, కొంత మంది పిల్లల కోసం తీసుకెళుతారని ఇమ్రాన్ తెలిపాడు. తమ దగ్గర కేవలం కేజి రు. 240 ఉంటుందన్నారు. చాలా మంది ఆర్డర్లు కూడా ఇస్తున్నారని సోదరులు తెలిపారు‌ కొనుగోలుదారుల ను ఇమ్రాన్ సోదరులు చాలా మంచిగా పలకరిస్తు అందరి మన్ననలు పొందటం అభినందనీయమని సమద్ ఆ యువకుల కృషిని ప్రశంశిస్తు నేటి యువతకు ఇమ్రాన్ సోదరులు ఆదర్శం అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.