Wednesday, 25 March 2026
  • Home  
  • యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్
- E-పేపర్

యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి శ్రీ *మతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్.* .. *విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ లో స్థానిక రాజకీయ ప్రమేయం ఏమిటి?* *విద్యార్థులను భయబ్రాంతులు చేయడంలో అంతర్యం ఏమిటి?* *వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు! విద్యార్ధులకు ఆసరాగా వుంటాము – భరత్* *ప్రజా రక్షకులా! ప్రజా భక్షకులా!* రాజమండ్రి నగరానికి తలమానికం అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘసంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులుగారు స్థాపించారు. పేద మధ్య తరగతి విద్యార్ధులకు విద్యను అందించాలన్న మహా సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీనిని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో ఐదు విద్యాసంస్థలు కలవు, మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో నాలుగింటిని ప్రభుత్వంలో విలీనం చేశాం ఇప్పుడు ఈ విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుచున్నవి, హితకారిణి సమాజం చైర్మన్ గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి! ఐక్కడ వాళ్ల రాజకీయ పెత్తనం ఏమిటి! కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరి ఒకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు! ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలన అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు ఏం చేస్తున్నారు కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి, హితకారిణి సమాజానికి మరి ఎన్నో స్థలాలు రాజమండ్రిలో ఉన్నాయి కావాలంటే వాటి మీద పెత్తనం చేయమనండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో ఇటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని భరత్ కోరారు.. ఎంతో పేరుగాంచిన ఈ విద్యాసంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఇవన్నీ జరగవు కొన్ని కోట్లు ఖరీదు చేసే ఈ విద్యాసంస్థల స్థలాల మీద భూకబ్జాదారులు కన్ను పడటం వాస్తవం, కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి, హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ ను కళాశాలకు అప్పగించాలని అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థుల పైన ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యాసంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి, విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రిటైర్డ్ లెక్చరర్స్ వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి ప్రతినిధి
సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి రాజమండ్రి శ్రీ *మతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్.* ..

*విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ లో స్థానిక రాజకీయ ప్రమేయం ఏమిటి?*

*విద్యార్థులను భయబ్రాంతులు చేయడంలో అంతర్యం ఏమిటి?*

*వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు! విద్యార్ధులకు ఆసరాగా వుంటాము – భరత్*

*ప్రజా రక్షకులా! ప్రజా భక్షకులా!*

రాజమండ్రి నగరానికి తలమానికం అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘసంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులుగారు స్థాపించారు. పేద మధ్య తరగతి విద్యార్ధులకు విద్యను అందించాలన్న మహా సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీనిని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.

విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్.

ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో ఐదు విద్యాసంస్థలు కలవు, మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో నాలుగింటిని ప్రభుత్వంలో విలీనం చేశాం ఇప్పుడు ఈ విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుచున్నవి,

హితకారిణి సమాజం చైర్మన్ గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి! ఐక్కడ వాళ్ల రాజకీయ పెత్తనం ఏమిటి! కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరి ఒకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు! ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలన అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు ఏం చేస్తున్నారు కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి, హితకారిణి సమాజానికి మరి ఎన్నో స్థలాలు రాజమండ్రిలో ఉన్నాయి కావాలంటే వాటి మీద పెత్తనం చేయమనండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో ఇటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని భరత్ కోరారు..

ఎంతో పేరుగాంచిన ఈ విద్యాసంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఇవన్నీ జరగవు కొన్ని కోట్లు ఖరీదు చేసే ఈ విద్యాసంస్థల స్థలాల మీద భూకబ్జాదారులు కన్ను పడటం వాస్తవం, కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి, హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది

జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ ను కళాశాలకు అప్పగించాలని అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థుల పైన ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యాసంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి, విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రిటైర్డ్ లెక్చరర్స్ వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.