పున్నమి ప్రతినిధి, ధవళేశ్వరం:
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సోమవారం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. అధికారులు ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్.ఇ. కె గోపినాథ్ మాట్లాడుతూ,
“మహానుభావుని విశేషవ్యవస్థ దేశ అభ్యుదయానికి చేసిన కృషి అపారమైనది. ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో ఆయన చూపిన దూరదృష్టి, చేసిన కృషి నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. సమాజ హితానికి ఆయన చేసిన త్యాగస్ఫూర్తిని తరతరాలు స్మరించుకోవాలి” అని అన్నారు.
జయంతి వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.


