Thursday, 5 February 2026
  • Home  
  • మొక్కలు నాటి సంరక్షించాలి : నల్గొండ కలెక్టర్ పిలుపు
- తెలంగాణ

మొక్కలు నాటి సంరక్షించాలి : నల్గొండ కలెక్టర్ పిలుపు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో ఉన్న దశమి ల్యాబ్స్ ఫార్మా సంస్థలో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నా, వాటిని సంరక్షించకపోవడం వల్ల అవి ఎండిపోతున్నాయని, అలాంటి నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.నాటిన మొక్కలకు నిరంతర నీరు అందేలా చూడాలని, అవసరమైతే డ్రిప్ పద్దతి లేదా ట్యాంకర్ల ద్వారా నీరు పోయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో కంపెనీ చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్, ప్యాక్టరి లో భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే మియావాకి పద్ధతిలో చిట్టడవులను అభివృద్ధి చేయడం కోసం ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో నల్గొండ వంటి ప్రాంతాలకు పచ్చదనం ఎంతో అవసరమని అందుకు అందరూ విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో ఉన్న దశమి ల్యాబ్స్ ఫార్మా సంస్థలో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నా, వాటిని సంరక్షించకపోవడం వల్ల అవి ఎండిపోతున్నాయని, అలాంటి నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.నాటిన మొక్కలకు నిరంతర నీరు అందేలా చూడాలని, అవసరమైతే డ్రిప్ పద్దతి లేదా ట్యాంకర్ల ద్వారా నీరు పోయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో కంపెనీ చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్, ప్యాక్టరి లో భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే
మియావాకి పద్ధతిలో చిట్టడవులను అభివృద్ధి చేయడం కోసం ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో నల్గొండ వంటి ప్రాంతాలకు పచ్చదనం ఎంతో అవసరమని అందుకు అందరూ విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.