
మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలని లయన్స్ జిల్లా గవర్నర్ డి. సూర్యప్రకాష్ అన్నారు. “మన ఊరు, మన బాధ్యత” లో భాగముగా, స్థానిక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఆవరణలో లయన్స్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యుల బృందం మొక్కలను నాటారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ డి. సూర్యప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర బృందంతో, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవికుమార్ అద్భుతంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చేపడుతున్నారని, రానున్న వారాంతంలో ఐదు వందలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుండటం సంతోషకరమన్నారు.
వైస్ గవర్నర్ కె.వి.సుబ్బరాజు, జిఎంటీ కోఆర్డినేటర్ డి.ఎస్.ఎస్.వి. వర్మ, డిసి వి.ఎం. రావు, జోన్ చైర్మన్ సాహు రమణ మాట్లాడుతూ లయన్ రవికుమార్ జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తున్నారని, జిల్లా అటవీశాఖ అధికారుల సహకారంతో శ్రీకాకుళం జిల్లానే కాకుండా, విశాఖ, విజయనగరం జిల్లాలో కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు.
అనంతరం పొన్నాడ.రవి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అమితమైన బాధ్యతను అందించిన ఇంటర్నేషనల్ బృందానికి ధన్యావాదాలని, నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయని, అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలని, కాలుష్యాన్ని తరిమేసే రక్షకులు మొక్కలని, ఈ రోజు కళాశాల విద్యార్థులచే మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, జిల్లాలో అన్ని క్లబ్ లను సమన్వయము చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఇందులో భాగముగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం డిసి బరాటం.లక్ష్మణ రావు, పర్యావరణంపై, పొన్నాడ.రవి కుమార్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. మన వూరు, మన బాధ్యత మొక్కలు నాటే కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ పట్నాయక్, కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

