పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30:
‘మొంథా’ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ఇళ్లు కోల్పోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత భరోసా ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీ. మాడుగుల మండలం, అగం పాడు గ్రామంలో ఆమె గురువారం పర్యటించారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, కూలిపోయిన ఇళ్లను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా దివ్యలత మాట్లాడుతూ, రైతులు అధైర్య పడకుండా ఉండాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. సొంత భూమి రైతులకు, ఇళ్లు ధ్వంసం అయిన ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు స్పష్టం చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ గండేరీ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మొంథా నష్టపరిహారం,బాధితులకు కూటమి అండ,దివ్యలత హామీ
పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: ‘మొంథా’ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ఇళ్లు కోల్పోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత భరోసా ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీ. మాడుగుల మండలం, అగం పాడు గ్రామంలో ఆమె గురువారం పర్యటించారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, కూలిపోయిన ఇళ్లను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా దివ్యలత మాట్లాడుతూ, రైతులు అధైర్య పడకుండా ఉండాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. సొంత భూమి రైతులకు, ఇళ్లు ధ్వంసం అయిన ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు స్పష్టం చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ గండేరీ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

