మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు. వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది. విష సర్పాల భయంతో పాటు, కార్తీక మాసంలో జరిగే భీమేశ్వరస్వామి తెప్పోత్సవం కూడా దారి లేక నిలిచిపోయిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా కోరారని తెలిపారు.

మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం