డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు గన్నవరపు శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
అక్టోబర్ 16, 2025 తేదీ ఉదయం 8:00 గంటలకు అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో మరియు మధ్యాహ్నం 2:00 గంటలకు కొండకుదురు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “రచ్చబండ” మరియు “కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం” కార్యక్రమాలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడడం, సామాన్య విద్యార్థుల విద్యా హక్కులను రక్షించడం, మరియు వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ శాఖ నాయకులు, మాజీ ప్రతినిధులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా పాల్గొనవలసిందిగా గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


