Monday, 23 March 2026
  • Home  
  • మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన టి డబ్ల్యూ జె ఎఫ్.
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన టి డబ్ల్యూ జె ఎఫ్.

కాగజ్నగర్,నవంబర్ 6 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేక వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వృద్ధ మహిళ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నిలబడి,నిలబడి ఓపిక నశించి స్పృహతప్పి పడిపోవడం జరిగింది. కావున వెంటనే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి మున్సిపల్ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు ఈరోజు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వడ్నాల వెంకన్న, కార్యదర్శి వంగరి ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ కడారి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈర్ల సునీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్ పాల్గొన్నారు.

కాగజ్నగర్,నవంబర్ 6 :
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేక వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వృద్ధ మహిళ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నిలబడి,నిలబడి ఓపిక నశించి స్పృహతప్పి పడిపోవడం జరిగింది. కావున వెంటనే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి మున్సిపల్ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు ఈరోజు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వడ్నాల వెంకన్న, కార్యదర్శి వంగరి ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ కడారి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈర్ల సునీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.