మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా కేతి పోచమల్లు, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రవీణ్
బుగ్గారం :
జగిత్యాల జిల్లా బుగ్గారంలోని పడమటి వాడలో గల శ్రీ సాంబశివ నాగేశ్వర మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షులుగా కేతి పోచమల్లు. ఉపాధ్యక్షులుగా కప్పల భూమన్న, సుంకం గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రవీణ్, కోశాధికారిగా కప్పల లచ్చన్న, సహాయ కార్యదర్శిగా కేతి రవి, పెరుక రాజన్న (చిలుకయ్య) లు ఎన్నికయ్యారు. అనంతరం గత అధ్యక్ష, కార్యవర్గం పొలంపల్లి మల్లేశం, కూతురు పోచమల్లు లు సంఘం బాధ్యతలు నూతన కార్యవర్గానికి అప్పగించారు. శాలువాలతో నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందించారు.


