Tuesday, 31 March 2026
  • Home  
  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన సత్కారం
- ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన సత్కారం

అప్పన్న చందన ప్రసాదం.. కర్పూర చందనపుమాలతో సన్మానం జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అప్పన్న భూ సమస్యను పరిష్కరించండి నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం విశాఖ విమానాశ్రయంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు ఘనంగా సత్కరించారు. సింహాద్రి నాథుడు చందన ప్రసాదంతో పాటు చందనకర్పూర మాలను అందించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న 11 సమస్యలపై ముఖ్యమంత్రి కి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్ జీవోలో సడలింపులు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇలా 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గంట్ల శ్రీనుబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా వినతలను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీను బాబు చెప్పారు.. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అందుకు తగ్గ చర్యలు వేగవంతం చేయాలని కోరినట్లు శ్రీను బాబు తెలియజేశారు. అలాగే అప్పన్న భూ సమస్యను పరిష్కరించాలని కూడా వినతిపత్రం అందజేశారు

అప్పన్న చందన ప్రసాదం.. కర్పూర చందనపుమాలతో సన్మానం

జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం

అప్పన్న భూ సమస్యను పరిష్కరించండి

నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం విశాఖ విమానాశ్రయంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,
డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు ఘనంగా సత్కరించారు. సింహాద్రి నాథుడు చందన ప్రసాదంతో పాటు చందనకర్పూర మాలను అందించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న 11 సమస్యలపై ముఖ్యమంత్రి కి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్ జీవోలో సడలింపులు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇలా 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గంట్ల శ్రీనుబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా వినతలను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీను బాబు చెప్పారు.. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అందుకు తగ్గ చర్యలు వేగవంతం చేయాలని కోరినట్లు శ్రీను బాబు తెలియజేశారు. అలాగే అప్పన్న భూ సమస్యను పరిష్కరించాలని కూడా వినతిపత్రం అందజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.