Story highlights
- - ఓటు విలువ తెలుసుకో : మంచి వ్యక్తిని ఎన్నుకో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు జిల్లాలో జరగనుంది.
- జిల్లాలోని నెల్లూరు, బుచ్చి, ఆత్మకూరు మున్సిపాలిటీలలో పోలింగ్ జరగనుంది.
- ఈ పోలింగ్‌లో ఎవరి ఓటు వారు మనఃపూర్వకంగా వేసుకోవచ్చు.
– ఓటు విలువ తెలుసుకో : మంచి వ్యక్తిని ఎన్నుకో
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు జిల్లాలో జరగనుంది. జిల్లాలోని నెల్లూరు, బుచ్చి, ఆత్మకూరు మున్సిపాలిటీలలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో ఎవరి ఓటు వారు మనఃపూర్వకంగా వేసుకోవచ్చు. తనకు నచ్చిన పార్టీకి, అభ్యర్థికి, గుర్తుకి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం కల్పించి ఉంది. అందుచేత ఓటరు తనకు నచ్చిన, తాను మెచ్చిన అభ్యర్థికి ఇష్టపూర్వకంగా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసుకోవచ్చు.
బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటివరకు ఆయా అభ్యర్థులు ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు సైతం గురిచేశారు. తాయిలాల ఆశ చూపారు. ప్రచారాలతో హోరెత్తించారు. అయినా ఓటరు వీటన్నింటికీ అతీతుడై నిలబడ్డారు. అసలైన ఘట్టం నేడు రానే వచ్చింది. ఓటు ప్రజాస్వామ్యంలో ఓ వజ్రాయుధం. ఆ ఓటుతో తాను ఎన్నుకున్న వ్యక్తులను గద్దెలు ఎక్కించవచ్చు, దించవచ్చు. ఇంతటి గొప్పతనం ఓటులో ఉంది.
ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మగా, ఆయువుపట్టుగా ఓటును మేధావులు చెప్తారు. అలాంటి ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఓటరు తన ఓటును సద్వినియోగం చేసుకొని మంచి అభ్యర్థికి, ప్రజాసేవకుడు అయిన వ్యక్తికి, నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తికి ఓటు వేయాల్సి ఉంది. ఆ సమయం రానే వచ్చింది. నేడే ఈనాడే పట్టణ ఓటరు ఇచ్చే సులక్షణ తీర్పుకు శ్రీకారం చుట్టే రోజు నేడే.
News Sources
- Punnami ReportingOwn reporting