Friday, 6 February 2026
  • Home  
  • మిషన్ భగీరథ లీకేజీతో తాసిల్దార్ కార్యాలయం ముందే దుస్థితి!
- కామారెడ్డి

మిషన్ భగీరథ లీకేజీతో తాసిల్దార్ కార్యాలయం ముందే దుస్థితి!

– మిషన్ భగీరథ నీరు లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం.. – పట్టించుకోని అధికార యంత్రాంగం.. కామారెడ్డి, 11 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు లీకై, సంవ త్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా, రామారెడ్డి మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం ముందే ఈ లీకేజీ సమస్య తీవ్రంగా ఉండడం, తీవ్ర విమర్శలు వినిపి స్తున్నాయి. దానిపై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమ వుతోంది. రోడ్డుపై వరదలా నీరు….. తాసిల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై మిషన్ భగీరథ నీరు లీకై పెద్ద మడుగులా ఏర్పడింది. ఈ నీరు రోడ్డును ఆక్రమించడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహన దారులు, పాదచారులు ఈ బురద నీటిని దాటుకు ని వెళ్లడానికి తిప్పలు తప్పడం లేదు.కార్యాల యం ముందే ఈ పరిస్థితి ఉండటంతో, ప్రభుత్వ పనుల కోసం వచ్చే ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమవుతున్న తాగునీరు….. లీకేజీ అయిన నీరు రోడ్డుపైన నిలిచి ఉండటంతో, అది మురికి, బురదతో కలిసి కలుషితమవుతోంది. ఇదే నీరు తిరిగి భూమిలోకి లేదా ఇతర పైప్‌లైన్ల లోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల మండల ప్రజ లు కలుషితమైన నీటిని తాగాల్సి వస్తుందని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యంగా ఉందని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిప డుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు….. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన తాసిల్దార్ కార్యాలయం ముందే ఇలాంటి దుస్థితి నెలకొనడం అధికార యంత్రాంగం నిష్క్రియాపరత్వాన్ని స్పష్టం చేస్తోందని స్థానిక నాయకులు, ప్రజలు విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంట నే స్పందించి, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకే జీని యుద్ధ ప్రాతిపదికన అరికట్టి, రోడ్డును పునరుద్ధరిం చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తు న్నారు.

– మిషన్ భగీరథ నీరు లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం..
– పట్టించుకోని అధికార యంత్రాంగం..

కామారెడ్డి, 11 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :

తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు లీకై, సంవ త్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా, రామారెడ్డి మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం ముందే ఈ లీకేజీ సమస్య తీవ్రంగా ఉండడం, తీవ్ర విమర్శలు వినిపి స్తున్నాయి. దానిపై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమ వుతోంది.

రోడ్డుపై వరదలా నీరు…..

తాసిల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై మిషన్ భగీరథ నీరు లీకై పెద్ద మడుగులా ఏర్పడింది. ఈ నీరు రోడ్డును ఆక్రమించడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహన దారులు, పాదచారులు ఈ బురద నీటిని దాటుకు ని వెళ్లడానికి తిప్పలు తప్పడం లేదు.కార్యాల యం ముందే ఈ పరిస్థితి ఉండటంతో, ప్రభుత్వ పనుల కోసం వచ్చే ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

కలుషితమవుతున్న తాగునీరు…..

లీకేజీ అయిన నీరు రోడ్డుపైన నిలిచి ఉండటంతో, అది మురికి, బురదతో కలిసి కలుషితమవుతోంది. ఇదే నీరు తిరిగి భూమిలోకి లేదా ఇతర పైప్‌లైన్ల లోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల మండల ప్రజ లు కలుషితమైన నీటిని తాగాల్సి వస్తుందని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యంగా ఉందని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిప డుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు…..

ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన తాసిల్దార్ కార్యాలయం ముందే ఇలాంటి దుస్థితి నెలకొనడం అధికార యంత్రాంగం నిష్క్రియాపరత్వాన్ని స్పష్టం చేస్తోందని స్థానిక నాయకులు, ప్రజలు విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంట నే స్పందించి, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకే జీని యుద్ధ ప్రాతిపదికన అరికట్టి, రోడ్డును పునరుద్ధరిం చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తు న్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.