Monday, 8 December 2025
  • Home  
  • మా పొలంలో ట్రాన్సఫార్మర్ ను తొలగించండి -వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి
- అన్నమయ్య

మా పొలంలో ట్రాన్సఫార్మర్ ను తొలగించండి -వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి

సిదవటం మండలంలోని పెద్దపల్లి రెవిన్యూ గ్రామ లోని నాపొలం లో ట్రాన్స్ ఫార్మర్ ను అక్రమంగా ఏర్పాటు చేశారని తొలగించాలని వై ఎస్ ఆర్ సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం లోని బాకరాపేటలో బుధవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి రెవిన్యూ గ్రామంలోని నరవకాటి పల్లె కణం బావివద్ద ఉన్న సర్వేనెంబర్ 1090-4లో ఏర్పాటు చేసుకోవాల్సిన ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలను పెద్దపల్లి రెవిన్యూ గ్రామంలోని బాకరాపేట గ్రామం లోని సర్వే నెంబర్ 858-2, 858-3 లోని తమ పొలంలో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి తన భూమిని కబ్జా చేసేందుకు ఒంటిమిట్ట లోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి గుర్రంపాటి మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సిద్ధవటం రెవిన్యూ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా ఒంటిమిట్ట విద్యాశాఖ అధికారులు మోహన్ రెడ్డికి అనుమతులు ఎలా ఇచ్చారని ఆమె ధ్వజమెత్తారు. అతనిపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. శృతి స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మాట్లాడుతూ ఏకుల రాజేశ్వర్ రెడ్డి భూమిలో అక్రమంగా భూమిని కబ్జా చేసేందుకు విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫారం ఏర్పాటుచేసిన గుర్రంపాటి మోహన్ రెడ్డి పై చర్యలు చేపట్టి అతని ఉద్యోగం నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి నాగలారపు అరుణ మాట్లాడుతూ రాజేశ్వర్ రెడ్డి కి జరిగింది అన్యాయమన్నారు. ఆమె భూమిలో ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేశారన్నారు. అలా చేయడం చట్టబద్ధంగా నేరమని ఆమె సిద్ధవటం ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చారన్నారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని మహిళా సంఘాలతో కలిపి ధర్నా చేస్తామన్నారు. ఆమెకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారూ. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మీనాక్షి, ఆయేషా, సుబ్బరత్నమ్మ, కరిమున్, మౌనిక పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.