*మార్గశిర మాసోత్సవం సందర్బంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
* ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఉత్సవ కమిటీ కి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే
* రెండో గురువారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేయుచున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి
* ప్రసాదాల కౌంటర్, సామాన్య భక్తుల సదుపాయాలు మరియు ఇతర అంశాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే
మార్గశిర మాసవత్సవం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తులకు కలిగే ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ప్రజలను, భక్తులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవ కమిటీ మరియు ఆలయ సిబ్బంది సహకారంతో అత్యంత వైభవోపేతంగా మొదటి గురువారం భక్తులకు దర్శనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రానున్న రెండో గురువారం దృష్టిలో పెట్టుకుని పలు సదుపాయాలు కల్పనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్థానిక పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. భక్తుల అధిక రద్దీ నేపద్యంలో స్థానిక సిబ్బంది సమన్వయంతో మరిన్ని ఏర్పాట్లు కల్పించే విధంగా చర్యలకు పలు సూచనలును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి మార్గశిర మహోత్సవాలలో భక్తులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఏఈఓ ఆనంద్ కుమార్ ,రాజేంద్ర, ఈ ఈ రమణ, సిఐ ప్రసాద్ గారు, బిజెపి , టీడీపీ, జనసేన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు….


