కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో,నంద్యాల ఐఎంఏ,లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో భాగంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం సబ్ జూనియర్, జూనియర్ పాఠశాల విద్యార్థులకు, బుధవారం సీనియర్ విభాగంలో శాస్త్రీయ,జానపద, సాధారణ,దేశభక్తి విభాగాలలో సోలో,మరియు బృంద గాన పాటల పోటీలు నిర్వహించారు.
చిన్నారులు తమ గాన కళతో మాతృభూమికి స్వరార్చన చేశారు. పాల్గొన్న బాలలందరూ తమ గానంతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తేజపూరితమైన దేశభక్తి పాటలు, చక్కటి గానాలాపనలతో శాస్త్రీయ గీతాలు, పల్లె జీవితాలకు అద్దం పట్టే జానపద పాటలు విశేషంగా అలరించాయి.
వాద్య సంగీత పోటీలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీతమ్మ ,లక్ష్మీ కల్యాణి, వ్యవహరించారు.
కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు , కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు నీలకంఠమాచారి, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పోటీలను పర్యవేక్షించారు.
*గురు వారం నిర్వహించే పోటీలు:*
గురువారం 4 వ తేదీ న నర్సరీ, ఎల్కేజీ ,యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో, సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో తెలుగు పద్య పఠనం పోటీలు ఎన్టీఆర్ పురపాలక సెంటినరీ టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు.
*తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు ఉపన్యాస పోటీ విజేతలు:*
అప్పటికప్పుడు ఇచ్చిన అంశమైన స్నేహబంధం పై తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు లో మాట్లాడే పోటీలో
ఆల్ సుమయ, సాయి వర్షిని, దీక్షా రెడ్డి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, పి.సరయు స్పెషల్ జూరి బహుమతి సాధించింది.
ఈ పోటీలకు తెలుగు అధ్యాపకులు డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు,నరేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

మాతృభూమికి స్వరార్చన మాతృభూమికి కళార్చన మూడవరోజు పాటల పోటీల నిర్వహణ అలరించిన చిన్నారుల గానాలాపాన
కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో,నంద్యాల ఐఎంఏ,లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో భాగంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం సబ్ జూనియర్, జూనియర్ పాఠశాల విద్యార్థులకు, బుధవారం సీనియర్ విభాగంలో శాస్త్రీయ,జానపద, సాధారణ,దేశభక్తి విభాగాలలో సోలో,మరియు బృంద గాన పాటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు తమ గాన కళతో మాతృభూమికి స్వరార్చన చేశారు. పాల్గొన్న బాలలందరూ తమ గానంతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తేజపూరితమైన దేశభక్తి పాటలు, చక్కటి గానాలాపనలతో శాస్త్రీయ గీతాలు, పల్లె జీవితాలకు అద్దం పట్టే జానపద పాటలు విశేషంగా అలరించాయి. వాద్య సంగీత పోటీలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీతమ్మ ,లక్ష్మీ కల్యాణి, వ్యవహరించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు , కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు నీలకంఠమాచారి, కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు పోటీలను పర్యవేక్షించారు. *గురు వారం నిర్వహించే పోటీలు:* గురువారం 4 వ తేదీ న నర్సరీ, ఎల్కేజీ ,యూకేజీ బాలలకు ఆంగ్ల రైమ్స్ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో, సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో తెలుగు పద్య పఠనం పోటీలు ఎన్టీఆర్ పురపాలక సెంటినరీ టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. *తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు ఉపన్యాస పోటీ విజేతలు:* అప్పటికప్పుడు ఇచ్చిన అంశమైన స్నేహబంధం పై తెలుగేతర పదాలు వాడకుండా పూర్తి తెలుగు లో మాట్లాడే పోటీలో ఆల్ సుమయ, సాయి వర్షిని, దీక్షా రెడ్డి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, పి.సరయు స్పెషల్ జూరి బహుమతి సాధించింది. ఈ పోటీలకు తెలుగు అధ్యాపకులు డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు,నరేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

