Thursday, 5 February 2026
  • Home  
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి.
- E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి. అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు/ తాడేపల్లి – పున్నమి న్యూస్ ప్రతినిధి (సింగమాల వెంకటేష్ ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన రైల్వే కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గం, రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన కోటి సంతకాల కార్యక్రమం, ఇతర ప్రజా సమస్యలపై పోరాడిన పలు కార్యక్రమాలపై ధ్వజారెడ్డి వివరించారని సమాచారం. స్థానిక రోడ్ల సమస్యలు, మౌలిక సదుపాయాలు, తుఫాన్ సమయంలో వైసీపీ పార్టీ తరపున స్థానికంగా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నిలిచిన వరద నీరును సొంత ఖర్చులతో నీటిని తొలగించేందుకు స్పందించిన తీరు పై జగన్మోహన్ రెడ్డికి వివరించగా, ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్న విధానంపై వైసీపీకి వస్తున్న ప్రజాస్పందన పై సంతోషం వ్యక్తపరిచినట్లు తెలియ వచ్చినది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి.

అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు/ తాడేపల్లి – పున్నమి న్యూస్ ప్రతినిధి (సింగమాల వెంకటేష్ ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన రైల్వే కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గం, రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన కోటి సంతకాల కార్యక్రమం, ఇతర ప్రజా సమస్యలపై పోరాడిన పలు కార్యక్రమాలపై ధ్వజారెడ్డి వివరించారని సమాచారం. స్థానిక రోడ్ల సమస్యలు, మౌలిక సదుపాయాలు, తుఫాన్ సమయంలో వైసీపీ పార్టీ తరపున స్థానికంగా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నిలిచిన వరద నీరును సొంత ఖర్చులతో నీటిని తొలగించేందుకు స్పందించిన తీరు పై జగన్మోహన్ రెడ్డికి వివరించగా, ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్న విధానంపై వైసీపీకి వస్తున్న ప్రజాస్పందన పై సంతోషం వ్యక్తపరిచినట్లు తెలియ వచ్చినది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.