Tuesday, 24 March 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి పార్థివదేహానికి బత్యాల నివాళి
- అన్నమయ్య

మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి పార్థివదేహానికి బత్యాల నివాళి

రాజంపేట, ఆగస్టు — (పున్నమి ప్రతినిధి) హైదరాబాద్ మహానగరంలో మంగళవారం నాడు ఆకస్మికంగా కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారి పార్థివదేహానికి, మాజీ ఎమ్మెల్సీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ|| శ్రీ బత్యాల చంగల్‌రాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మదన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన బత్యాల, తాను తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ: “మదన్మోహన్ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు. ఆయన మృదుస్వభావి, మితభాషి. తక్కువ కాలంలో ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందిన నాయకుడు. నిజాయితీ, నిష్ట, శ్రమతో ప్రజాసేవ చేసిన శాసనసభ్యుడు. రాజంపేట బైపాస్ రోడ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి కీలక అంశాల్లో ఆయన పాత్ర మరువలేనిది. అలాంటి నేత మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

రాజంపేట, ఆగస్టు — (పున్నమి ప్రతినిధి)
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం నాడు ఆకస్మికంగా కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారి పార్థివదేహానికి, మాజీ ఎమ్మెల్సీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ|| శ్రీ బత్యాల చంగల్‌రాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మదన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన బత్యాల, తాను తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ: “మదన్మోహన్ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు. ఆయన మృదుస్వభావి, మితభాషి. తక్కువ కాలంలో ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందిన నాయకుడు. నిజాయితీ, నిష్ట, శ్రమతో ప్రజాసేవ చేసిన శాసనసభ్యుడు. రాజంపేట బైపాస్ రోడ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి కీలక అంశాల్లో ఆయన పాత్ర మరువలేనిది. అలాంటి నేత మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.