పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీపై వివాదం చెలరేగింది. శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో గోపినాథ్ తల్లి, మొదటి భార్య మాలినీ, కుమారుడు తారక్ ప్రద్యుమ్న హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్తో కలిసి సునీత కూతురు దిశిర కూడా హాజరై వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా గోపినాథ్ తల్లి మాట్లాడుతూ, “నా కుమారుడి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
మాగంటి కుటుంబ అంతర్గత సమస్యగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు ఎక్కింది.


