Thursday, 5 February 2026
  • Home  
  • * మహేశ్వరం ఆర్టీసీ బస్సులో కె ఎల్ ఆర్ఉ–చిత బస్సు ప్రయాణంపై మహిళలతో ముచ్చట –రోజూ 36వేల మంది ఆడపడుచుల ప్రయాణం*
- రంగారెడ్డి

* మహేశ్వరం ఆర్టీసీ బస్సులో కె ఎల్ ఆర్ఉ–చిత బస్సు ప్రయాణంపై మహిళలతో ముచ్చట –రోజూ 36వేల మంది ఆడపడుచుల ప్రయాణం*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : ప్రతీ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు రూ.3000 నుంచి రూ.4వేలు ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు.ఇవాళ మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36 వేల మంది మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు స్పష్టం చేశారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతీ ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి సహా మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీలు, గ్రామ, బూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.