ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
కరీంనగర్ లోని మహా శక్తి అమ్మ వారి ని బుధవారం నాడు ఖమ్మం జిల్లా కి చెందిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి దర్సించుకున్నారు. ఈ సందర్భముగా బండి సంజయ్ వారితో మాట్లాడుతు ఖమ్మం జిల్లా ప్రజలకి మహా శక్తి అమ్మ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూన్నాను అని, అలాగె విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బండి సంజయ్ వారితో అన్నారు. చావా కిరణ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్, సంతోష్ రెడ్డి, తదితరులు మహా శక్తి అమ్మ వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.


