(పున్నమి న్యూస్) సెప్టెంబర్ 7 :///
ఇవాళ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషముల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 25 నిమిషములు వరకు ఇది కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా రాత్రి 8 గంటల 58 నిమిషములకు చంద్రగ్రహణం మొదలు కానుంది.


