*మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బోధవలస గ్రామం మరియు ఎల్లిప్పి గ్రామాలలో పర్యటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో చేపట్టిన మన పల్లెకు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఆయనతో పాటుగా సబ్బవరం మండలం అన్ని శాఖల మండల అధికారులు పాల్గొన్నారు ముందుగా బోదవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రియతమనాయకునికి ప్రజలు నీరాజనాలు పట్టారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు పలు వినతులు అందచేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, చేతి బోర్లు, గృహ నిర్మాణాలు, స్థల కేటాయింపులు, కళ్యాణమండపం నిర్మాణం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్తమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను దపాదపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ యొక్క కార్యక్రమంలో సబ్బవరం మండలం ప్రజా పరిషత్ అధికారి పద్మజా, మండల రెవెన్యూ అధికారి చిన్ని కృష్ణ , శాసనసభ్యులు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు , మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు , గొంప నర్సింగరావు , మండల సీనియర్ సాలాపు వెంకటేశ్వరరావు , ఇందల రమణ, బల్రెడ్డి అప్పారావు , మిడతాన మహాలక్ష్మి నాయుడు ,బోధవలస గ్రామం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంచిపాటి రాంబాబు , గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరు సూర్యనారాయణ , ఎలిప్పి గ్రామం సర్పంచ్ ఉగ్గిన దేవుడమ్మ ,ఎలిప్పి గ్రామ ఎంపీటీసీ ఉగ్గిన లక్ష్మీ రాము,అమర పిన్ని నర్సింగరావు , పాపన్న ఎల్లాజీ , కర్రి విగ్నేష్ , ఉగ్గిన దిలీప్ , కొట్టాడ గణేష్ , దారపు కృష్ణ , తుంపాల శ్రీనివాస్ , కోటేశ్వరరావు , మండల నాయకులు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు , సర్పంచ్ మామిడి శంకర్రావు ,బొకం స్వామి నాయుడు , ఆకుల గణేష్, రోమాల చంద్రశేఖర్ ,సరగడం రాము , బంతి కోళ్ల పద్మా, బుదిరెడ్ల కనకరాజు, గొర్లి కుమారస్వామి , గుల్లిపిల్లి మాజీ సర్పంచ్ నరసింగరావు గారు,కిల్లి వెంకట సత్యనారాయణ గారు,తాటిపాముల శేఖర్ , పల్లి మంగరాజు , తామాడ సత్యనారాయణ , మేడపాటి రాము , పడాల వెంకటరమణ , రేసుపూడి రమణ, హర గోపాల్ ,పిన్నింటి పార్వతి , హైమావతి ,రాపర్తి కిషోర్ , తనకాల శ్రీనివాసరావు , డీలర్ ఎల్లాజీ , హరి హర సబ్బవరం మండలం ఉన్నతాధికారులు మరియు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు


