ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు. వాహనాలను ఒక్కోటిగా ఆపి డ్రైవర్‌లను చెక్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


