శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని పోలీస్ స్టేషన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ జి. శ్రీనివాసరావు గారు మరియు సీఐ శివరామకృష్ణారెడ్డి గారు ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి వ్యక్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, హెల్మెట్ వినియోగం ప్రాణాలను కాపాడే రక్షాకవచమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకంగా యువత రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


