పున్నమి ప్రతినిధి:
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పీఎస్ పరిధిలో ఘటన
ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల వెల్లడి
ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకా రం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రా మంలో పోతురాజు అలివేలు కూలిపని చేసుకుంటూ తన నాన్న సిద్ధగోని నారయ్య దగ్గర ఉంటూ జీవనం సాగిస్తుం ది. అలివేలు భర్త మహేష్ 16 ఏండ్ల క్రితమే
చనిపోయాడు. ఈమె కూతురు పోతు రాజు పూజ (17) ఇబ్రహీంపట్నంలోని కార్తీకేయ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్ పూజ ప్రేమలో పడింది. అతనినే పెండ్లి చేసు కుంటానని పూజ ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి పూజ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.



