రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్. శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించగా వడ్లపల్లి మస్తానయ్య అనే వ్యక్తి వద్ద 10 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 180 ml మద్యం సీసాలు కలిగియుండగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గూడూరు కోర్టుకు పంపడమైనదని తెలియజేస్తూ ప్రస్తుతం కొత్తగా వచ్చిన జీవో ప్రకారం నాన్ బెయిలబుల్ కావున ఎలాంటి స్టేషన్ బెయిలు ఇవ్వబడవు ఆని ప్రజలకు తెలియజేశారు