చిట్వేలి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే కాటా ఆవరణలో బొప్పాయి రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గురువారం ఉదయం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బొప్పాయి రైతులకు టన్నుకు రూ.14,000 వేలు ఉండగా ఉన్నట్టుండి వ్యాపారస్తులు 8,000 కి తగ్గించడంతో బొప్పాయి రైతులు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని బొప్పాయి రైతులందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి పంటలో వ్యాపారస్తులు చేస్తున్న అన్యాయానికి మండలంలోని అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే మార్గంలో కాటా నందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న చిట్వేలీ మండల ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రైతులతో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు మాట్లాడుకొని సామరస్యంగా వెళ్లాలని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అనంతరం మధ్యాహ్నం కాటా ఆవరణలో రైతులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు బొప్పాయి రైతులకు టన్నుకు 16,000 వేలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ఈ ధర్నాని మరింత బలోపేతం చేసి రైతులతో కలిసి ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు వేసిన ప్రతి పంటలో వ్యాపారస్తులు, దళారులు, చేస్తున్న అరాచకాలను, గుర్తించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి తెలియజేశారు.

మద్దతు ధర కల్పించాలని బొప్పాయి రైతులు ధర్నా