
మంథనిలో శాకాంబరీ అవతారంలో శ్రీ వాసవి మాత
మంథని, జులై 13, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారిని ఆదివారం శాకాంబరిగా అలంకరించారు. వేదమూర్తులైన బ్రాహ్మణులు అవధానుల శ్రీకాంత్, రజనీకాంత్ వేద మంత్రాల నడుమ అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి మంగళ స్నానం అనంతరం అలంకరణ, లలిత పారాయణం, వాసవి మాత జీవిత చరిత్ర, భగవద్గీత తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి.
దేవాలయ కమిటీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు నల్మాస్ ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఎల్లంకి వంశీధర్ పాల్గొన్నారు. సుమారు 300 పైగా పెద్ద ఎత్తున భక్తులు, మహిళల సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో రాచర్ల నాగరాజు, రేపాల సత్యనారాయణ, చందా ఈశ్వర్, కొమరవెల్లి శ్రీధర్, రావికంటి మనోహర్, కొమురవెల్లి సత్యనారాయణ, ఇంటింటి వాసవి భజన బృందం కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

