డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో :
మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల, అప్పనపల్లిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం చైర్మెన్ శ్రీమతి కడలి శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నైనాల రఘురామయ్య గారు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చ జరిగింది.
ముందుగా విద్యార్థులు విద్యారంగంలో సాధించిన ప్రగతిని ఉపాధ్యాయులు వివరించారు. తరగతి వారీగా విద్యార్థుల పనితీరు, హాజరు, నైపుణ్యాల్లో వచ్చిన మెరుగుదలపై తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తరువాత మధ్యాహ్న భోజన పథక అమలు విధానం, భోజన నాణ్యత, పంపిణీ తీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరమైన సమీక్ష జరిగింది.
పాఠశాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఉపాధ్యాయులు పెద్దిరాజు గారు, రామకృష్ణ గారు, షబ్బీర్ హుస్సేన్ గారు, అనంతలక్ష్మిదేవి గారు పాఠశాలలో డైనింగ్ హాల్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ అత్యవసరమని, దాతలు ముందుకు వచ్చి నిర్మాణానికి సహకరిస్తే పాఠశాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ గెడ్డం చంద్రశేఖర్ గారు, మందపాటి రామకృష్ణ గారు, గెడ్డం లెనిన్ గారు పాల్గొన్నారు ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది.


